మెడికల్‌ షాపుల నిర్వాహకుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ షాపుల నిర్వాహకుల ధర్నా

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

తిరువళ్లూరు: ఆన్‌లైన్‌ ద్వారా మందులు విక్రయించడాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ తమిళనాడు మెడికల్‌షాపు నిర్వాహకుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పెద్దకుప్పం రైల్వేస్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సంఘం రాష్ట్రకార్యదర్శి అశోక్‌ అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఆన్‌లైన్‌ ద్వారా మెడిషన్‌ విక్రయించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 44 వేల దుకాణాలపై ప్రభావం పడుతుందని, దీంతో పలువురు ఉపాధి కోల్పోయే ప్రమాదం వుందని వాపోయారు. మెడికల్‌షాపు నిర్వాహకులు, దుకాణాల్లో పనిచేసే కార్మికులు సైతం తీవ్రంగా నష్టపోయే అవకాశం వుందన్నారు. ఆన్‌లైన్‌లో కాలం చెల్లిన మందులు, నాణ్యత లేని మెడికల్‌ వస్తువులను సైతం విక్రయిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆన్‌లైన్‌లో మెడిషన్‌ విక్రయాలను వెంటనే కట్టడి చేయాలని నినాదాలు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement