న్యూస్‌రీల్
సి.టి.ఆర్. నిర్మల్ కుమార్(విద్యుత్, న్యాయ మంత్రి) ఉసిలంపట్టికి చెందిన నిర్మల్ కుమార్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, అలాగే క్రిమినాలజీ పోలీస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు. తొలుత ఆర్‌ఎస్‌ఎస్, ఆ తర్వాత బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. అన్నామలైతో విభేదాలతో 2023లో అన్నాడీఎంకేలో చేరి ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత 2025లో ఆ పార్టీని వీడి టీవీకేలో చేరారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉంటూ, మీడియాలో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపిస్తూ మంత్రి అయ్యారు.
డాక్టర్ అరుణ్‌రాజ్ ( ఆరోగ్య శాఖమంత్రి) : నామక్కల్ కుమారమంగళానికి చెందిన 46 ఏళ్ల అరుణ్‌రాజ్ మాజీ ఐఆర్‌ఎస్ అధికారి, వెద్యుడు. 2002లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈయన, సివిల్ సర్వీసెస్ పాసైన తర్వాత కేంద్ర ఆదాయపు పన్ను శాఖలో (ఐఆర్‌ఎస్) పనిచేశారు. 2025లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని విజయ్ సమక్షంలో టీవీకేలో చేరారు. ప్రస్తుతం పార్టీలో పాలసీ ప్రొపగండా జనరల్ సెక్రటరీగా ఉంటూ, విజయ్‌కు పరిపాలనా పరమైన కీలక సలహాలు అందిస్తున్నారు.
టి.కె. ప్రభు(ఖనిజ వనరులు): సాంప్రదాయ కాంగ్రెస్ కుటుంబానికి చెందిన టి.కె. ప్రభు వృత్తిరీత్యా వైద్యుడు. గతంలో తమిళనాడు కాంగ్రెస్ ఐటీ వింగ్‌లో కీలక నేతగా ఉండేవారు. ఇన్‌స్ట్రాగామ్ రీల్స్ ద్వారా మంచి ప్రజాదరణ పొందిన ప్రభు, టీవీకే స్థాపించిన తర్వాత అందులో చేరారు. ఈ ఎన్నికల్లో కారైకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్‌ను ఓడించి సంచలన విజయం నమోదు చేశారు.
కీర్తన – పరిశ్రమల శాఖ: కేవలం 29 ఏళ్ల వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కీర్తన ఎమ్మెస్సీ గ్రాడ్యుయేట్. గతంలో ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ’ఐప్యాక్’ సంస్థలో పనిచేస్తూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో క్షేత్రస్థాయి వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ తర్వాత డీఎంకేకు చెందిన ’పెన్’ సంస్థలోనూ పనిచేశారు. 2025లో అక్కడి నుండి తప్పుకుని, స్వతంత్రంగా పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న తరుణంలో..ఈ ఏడాది మార్చి 28న టీవీకేలో చేరారు. చేరిన మరుసటి రోజే ఆమెకు టికెట్ దక్కడం, విజయం సాధించి ఇప్పుడు ఏకంగా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. కొత్త తరం వారికి అవకాశం కల్పించినట్టుగా తమకుకూడా మంత్రి ఛాన్స్ వస్తుదన్న ఆశతో అనేక మంది పట్టభద్రులైన సామాన్య ఎమ్మెల్యేలు ఎదురు చూస్తుండటం విశేషం.
నేడు కొత్త మంత్రుల జాబితా
వెలువడే అవకాశం
గురువారం ప్రమాణస్వీకారం?
సాక్షి, చైన్నె : సీఎం విజయ్ కేబినెట్‌లో మరి కొంత మంది మంత్రులు బాధ్యతలు చేపట్టబోతున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి. తాజాగా తొమ్మిది మంది మంత్రులకు శాఖల కేటాయింపు పోగా, మరో 22 శాఖలకు మంత్రుల నియామకం జరగాల్సి ఉంది. ఇందులో కాంగ్రెస్‌కు రెండు, అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నట్టు, మిగిలిన పదవులలో టీవీకే ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించేందుకు సీఎం విజయ్ నిర్ణయించినట్టు సమాచారం. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొత్త మంత్రుల జాబితా బుధవారం వెలువడే అవకాశం ఉందని, వారు గురువారం ప్రమాణస్వీకారం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తాజా 9 మంది మంత్రుల నేపథ్యం ఇదీ..
పెరిగిన ఆశావహుల సంఖ్య


