శిరువాపురి ఆలయంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

శిరువాపురి ఆలయంలో భక్తుల రద్దీ

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

తిరువళ్లూరు: శిరువాపురిలోని బాలసుబ్రమణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది. రెండు గంటలపాటు క్యూలో నిలబడి భక్తు లు స్వామి దర్శనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా శిరువాపురిలో బాలసుబ్రమణ్యస్వామి ఆలయం వుంది. ఆలయంలో ఏడువారాల పాటు మంగళవారం స్వామి వారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న నమ్మకం వుండడంతో భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం నుంచే భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. రెండు గంటల పాటు భక్తులు క్యూలో వేచివుండి స్వామి దర్శనం చేసుకున్నారు. సాయంత్రం స్వామికి 15 రకాల ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించి పుష్పాలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక దీపారాధన నిర్వహించిన తరువాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement