తమిళసినిమా: సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కడుప్పు. త్రిష నటించిన ఇందులో ఆర్జే. బాలాజీ ప్రతినాయకుడిగా నటించారు. శ్వాసిక, ఇంద్రన్, యోగిబాబు శివద, సుప్రీత్‌రెడ్డి, అనక, మాయా రవి, నట్టి నటరాజ్ ముఖ్యపాత్రులు పోషించారు. ఆర్జే.బాలాజీ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్సార్ ప్రకాష్‌బాబ, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించారు. సాయి అభయంకర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గత 15న తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రంలో పాటల వ్యవహారంలో సంగీత దర్శకుడు ఇళయరాజా హక్కులను కోరుతూ కోర్టును ఆశ్రయించడాన్ని గుర్తుచేసే ఒక సన్నివేశం చోటు చేసుకుంది. ఈ విషయమై కరుప్పు చిత్ర నిర్మాణ సంస్థ మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో కడుప్పు చిత్రంలో ఇళయరాజా పేరును పొందుపరచడం అన్నది ఆ సన్నివేశాన్ని కొనసాగించే ఉద్దేశంతో యాదృచ్ఛికంగా జరిగిందే కానీ, 50 ఏళ్లకు పైగా సంగీత సామ్రాజ్యాన్ని పాలిస్తున్న సంగీత రారాజును కించపరచాలన్న భావన చిత్ర యూనిట్‌కు లేదు. ఎటువంటి దురుద్దేశం లేకుండా చోటుచేసుకున్న ఆ సన్నివేశం కారణంగా మీకు గానీ, మీ అభిమానులకు గానీ, మనసు గాయపడితే అందుకు మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు.
కరప్పులో
సూర్య, త్రిష
బ్లాస్ట్
నిజంగా బ్లాస్టే
తమిళసినిమా: యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతిముకుందన్ ప్రధానపాత్రలు పోషించిన చిత్రం బ్లాస్ట్. ఇందులో జాన్ కొకెన్, అర్జున్ చిదంబరం, పవన్, బాలహాసన్, వినోద్‌సాగర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ కల్పత్తి ఎస్.అగోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పర్తి ఎస్.సురేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అర్చన కల్పతి క్రియేట్ ప్రొడ్యూసర్‌గాను, ఐశ్వర్య కల్పతి అసోసియేట్ క్రియేట్ ప్రొడ్యూసర్‌గాను బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రం ద్వారా సుభాష్ కె.రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ప్రదీప్ రంగనాథన్ శిష్యుడు అన్నది గమనార్హం. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని, అరుణ్ రాధాకష్ణన్ చాయాగ్రహణం అందించారు. ఈచిత్రం ఈనెల 28న తెరపైకి రానుంది. చిత్ర ఫ్రీ రిలీజ్ కార్యక్రమాన్ని సోమవారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు సుభాష్ కె.రాజ్ మాట్లాడుతూ దర్శకుడుగా చిత్త పరిశ్రమంలో ఇది తన తొలి అడుగని, ప్రదీప్ రంగనాథన్ నా సినీ గురువన్నారు. అర్జున్ మాట్లాడుతూ బ్లాస్ట్ చిత్రం నిజంగా బ్లాస్టే. నేను ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించినా కరాటే మాస్టర్ పాత్రలో నటించడం ఇదే మొదటిసారి. నేను చాలామంది కొత్త దర్శకులతో పని చేశాను. అయితే దర్శకుడు సుభాష్ చాలా తెలివైనవాడు ఆయన నటీనటుల నుంచి తనకు కావలసిన విషయాలను చాలా చక్కగా రాబట్టుకునే ప్రతిభ కలిగిన వాడని అర్జున్ పేర్కొన్నారు.


