సుబ్బయ్య హత్య కేసులో మలుపు | - | Sakshi
Sakshi News home page

సుబ్బయ్య హత్య కేసులో మలుపు

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

● నిందితుల విడుదల రద్దు ● యావజ్జీవ శిక్ష ఖరారు ● సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సాక్షి, చైన్నె : రాష్ట్రంలో కలకలం సృష్టించిన చైన్నె న్యూ రాలజిస్ట్‌ డాక్టర్‌ సుబ్బయ్య హత్య కేసు సుప్రీంకోర్టులో మలుపు తిరిగింది. నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సు ప్రీంకోర్టు పూర్తిగా రద్దు చేసింది. ట్రయల్‌ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ, నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష (జీవిత ఖైదు) విధిస్తున్నట్లు జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది.

కేసు నేపథ్యం ఇదీ

2013లో చైన్నె రాజా అన్నామలైపురంలో ఆస్తి వివా దం కారణంగా ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ సుబ్బ య్యను కిరాయి ముఠా దారుణంగా హత్య చేసింది. ఈ కేసులో ఆయన బంధువు పొన్ను స్వామి, ఆయన భార్య మేరీ పుష్పం, వారి కుమా రులు బాసిల్‌, బోరిస్‌, బాసిలిన్‌తో పాటు స్నేహితులు విలియమ్స్‌, డాక్టర్‌ జేమ్స్‌ సతీష్‌కుమార్‌, ఏసురాజన్‌, మురుగన్‌, శాంత ప్రకాష్‌ను పోలీ సులు అరెస్ట్‌ చేశారు. చైన్నె సెషనన్స్‌ కోర్టు ఈ కేసులో పొన్నుస్వామి సహా ఏడుగురికి మరణశిక్ష, ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. అయితే, దీనిపై అప్పీలుకు వెళ్లగా మద్రాస్‌ హైకోర్టు ఆధారాలు సరిగ్గా లేవంటూ నిందితులందరినీ విడుదల చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం, డాక్టర్‌ సుబ్బయ్య సతీమణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

డాక్టర్‌ సుబ్బయ్య (ఫైల్‌), సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో మలుపు... కొత్త తీర్పు

మద్రాస్‌ హైకోర్టు ట్రయల్‌ కోర్టు ఆధారాలను సరిగ్గా పరిశీలించకుండానే నిందితులను విడుదల చేసిందని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో గరిష్ట శిక్ష అయిన మరణశిక్షను విధించడం లేదని, అయితే నిందితులందరికీ యావజ్జీవ శిక్ష విధిస్తున్నామని కోర్టు తెలిపింది. వృద్ధులైన పొన్నుస్వామి, మేరీ పుష్పా తమ కుమారుల ప్రేరేపణ వల్లే ఈ నేరంలో భాగస్వాములయ్యారని కోర్టు అభిప్రాయపడింది. దీంతో వారు శిక్ష తగ్గింపు కోసం గవర్నర్‌కు విజ్ఞప్తి చేసుకోవచ్చని పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తుది నిర్ణయం వచ్చే వరకు ఈ వృద్ధ దంపతుల జీవిత ఖైదును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. పొన్నుస్వామి, మేరీ పుష్పం మినహా మిగిలిన నిందితులందరూ తక్షణమే పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఎం సుందరేశ్‌ తీర్పు వెలువరించారు.

Advertisement
 
Advertisement
Advertisement