నేడు మెడికల్‌ షాప్‌లు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు మెడికల్‌ షాప్‌లు బంద్‌

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

కొరుక్కుపేట: ఆన్‌లైన్‌లో మెడికల్‌ మందుల అమ్మకాలకు నిరసనగా తమిళనాడు డ్రగ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ బుధవారం ఒక రోజు సమ్మెకు దిగనుంది. అక్రమ ఆన్‌న్‌లైన్‌ ఫార్మసీల కార్యకలాపాలను నిలిపివేయడంసహా పలు దీర్ఘకాలిక డిమాండ్లను చెబుతూ, అఖిల భారత డ్రగ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ దేశవ్యాప్తంగా ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చింది. దీనికి మద్దతుగా, బుధవారం తమిళనాడు వ్యాప్తంగా ఒకరోజు 40 వేల మెడికల్‌ షాప్‌లు మూసివేసి యజమానులు నిరసన తెలపనున్నారు. ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో తమిళనాడు డ్రగ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేష్‌ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో మందులు అమ్మకాలను నిలిపేయాలని నిరసిస్తూ బుధవారం ఒక్క రోజు మెడికల్‌ దుకాణాలు మూసివేస్తున్నట్టు తెలిపారు. 40వేల మంది సభ్యులున్న తమిళనాడు డ్రగ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌, కార్పొరేట్‌, ముఖ్యమైన ఫార్మసీలు కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. నకిలీ మందులను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. దుకాణాల మూసివేత నేపథ్యంలో ప్రజలకు హాని కలిగించని మందుల నిల్వలు తగినంతగా ఉండేలా చూడాలని తమిళనాడు డ్రగ్‌ కంట్రోల్‌ బోర్డ్‌, సరఫరా విభాగంలోని జోనల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ విషయమై, ఔషధ నియంత్రణ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌. గురుభారతి, ఆరోగ్య కార్యదర్శికి రాసిన లేఖలో అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలియజేశారని, అలాగే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని తమిళనాడు డ్రగ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ తమిళనాడు ప్రభుత్వాన్ని కోరిందని వెల్లడించారు .

Advertisement
 
Advertisement
Advertisement