పళ్లిపట్టు: సుందరరాజ పెరుమాళ్ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన గరుడసేవను సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆర్కేపేటలో సుందరరాజ పెరుమాళ్ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా యి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు సోమవారం రాత్రి పుష్పాలతో సుందరరాజ పెరుమాళ్‌ను అలంకరించి గరుడ వాహనంలో కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు దీపారాధన పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, బాణసంచా సంబరాల నడుమ స్వామివారిని గ్రామ పుర వీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుని స్వామిని దర్శించుకున్నారు.
మత్తుమాత్రల విక్రయం
–యువకుడి అరెస్ట్
తిరువళ్లూరు: యువత, విద్యార్థులే లక్ష్యంగా మత్తుమాత్రలను విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా ఎస్‌కేబీ నగర్ ప్రాంతంలో విద్యార్థులు, యువతే లక్ష్యంగా మత్తుమాత్రలను విక్రయిస్తున్నట్టు ఆవడి పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు అందింది. సమాచారం అందుకున్న కమిషనర్ అక్కడ నిఘా వుంచాలని స్థానిక సీఐని ఆదేశించారు. దీంతో అక్కడ నిఘా ఉన్న పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి బ్యాగును తనిఖీ చేశారు. తనిఖీలో బ్యాగులో గంజాయి, మత్తుమాత్రలు, ఇంజెక్షన్లు వున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పట్టుబడిన వ్యక్తి అంబత్తూరుకు చెందిన చోళయప్పన్ కుమారుడు కేశవపెరుమాల్(22)గా గుర్తించారు. అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.


