తిరువళ్లూరు: క్రిష్ణగిరి జిల్లా హొసూరులో జరిగిన జాతీయస్థాయి కుంఫూ పోటీల్లో తిరువళ్లూరు జిల్లా సెవ్వాపేటకు చెందిన క్రీడాకారులు తమ సత్తా చాటా రు. మొదటి స్థానంలో నిలవడంతో పాటు ఓవరాల్ చాంపియన్‌షిప్‌గా గెలిచి రికార్డు సృష్టించారు. క్రిష్ణగిరి జిల్లా హొసూరులో కుంఫూ జాతీయస్థాయి పోటీలు గత 16, 17 తేదీల్లో జరిగాయి. పోటీలకు దేశంమలోని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. 6 నుంచి 13 ఏళ్లు, 13 నుంచి 20 ఏళ్లు, 20 నుంచి 25 సంవత్సరాలు ఉన్న క్రీడాకారులకు మూడు కేటగిరిల్లో పోటీలను నిర్వహించారు. పోటీల్లో తిరువళ్లూరు జిల్లా సెవ్వాపేటకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. వారు జాతీయస్థాయిలో మొదటి స్థానం సాధించడంతోపాటు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచారు.


