స్కూల్‌ బస్సులను వేగంగా నడపొద్దు | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సులను వేగంగా నడపొద్దు

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

వేలూరు: ప్రైవేటు పాఠశాల బస్సులను అతి వేగంగా నడపకుండా విద్యార్థులను జాగ్రత్తగా తీసుకెళ్లాలని కలెక్టర్‌ సుబ్బులక్ష్మి డ్రైవర్లకు సూచించారు. కాట్పాడిలోని సన్‌బీమ్‌ పాఠశాల ఆవరణలో జిల్లాలోని ప్రైవేటు పాఠశాల బస్సుల కండిషన్‌లను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ స్కూల్‌ బస్సుల్లో విద్యార్థులను తీసుకెళ్లే సమయంలో అతి జాగ్రత్తగా తీసుకెళ్లే విధంగా బస్సులను కండిషన్‌గా ఉంచుకోవాలన్నారు. అదేవిధంగా పాఠశాల బస్సులను నడిపేందుకు అనుభవం ఉన్న సీనియర్‌ డ్రైవర్లను నియమించి ప్రతి బస్సుకు క్లీనర్‌ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం తాగి బస్సులను నడిపే డ్రైవర్ల లైసెన్స్‌లను రద్దు చేసేందుకు సిపారస్సు చేస్తామని హెచ్చరించారు. గత మూడేళ్లుగా జిల్లాలో ఎటువంటి ప్రమాదాలు జరగలేదని ఇదే పరిస్థితి కొనసాగేందుకు స్కూల్‌బస్సు డ్రైవర్లు సహకరించాలన్నారు. అనంతరం పాఠశాల బస్సులలను తనిఖీ చేశారు. వేలూరు డివిజన్‌ పరిధిలో 47 ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన 441 బస్సులను తనిఖీ చేశారు. ఆమెతో పాటు ఆర్టీఓ సుందర్‌రాజన్‌, విద్యాశాఖ సీఈఒ ప్రేమలత, అడిషనల్‌ ఎస్పీ పయణి, సబ్‌ కలెక్టర్‌ సెంథిల్‌కుమార్‌, విద్యాశాఖ అధికారులు, ఎంవీఐలు రాజ్‌కుమార్‌, ప్రైవేటు పాఠశాల, కళాశాలలకు చెందిన డ్రైవర్లు పాల్గొన్నారు. ముందుగా బస్సు డ్రైవర్‌లకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement