గ్రీవెన్స్‌డేకు పోటెత్తిన జనం | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌డేకు పోటెత్తిన జనం

May 19 2026 1:46 AM | Updated on May 19 2026 1:46 AM

తిరువళ్లూరు: సోమవారం ఉదయం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు జనం పోటెత్తడంతో రద్దీగా మారింది. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు గ్రీవెన్స్‌డేను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గ్రీవెన్స్‌డేకు అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరువుతుండగా, జిల్లా నలుమూలల నుంచే వచ్చే ప్రజలు తమ సమస్యల కోసం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో గ్రీవెన్స్‌డే ఎన్నికల కోడ్‌తో దాదాపు రెండు నెలలు వాయిదా పడింది. కోడ్‌ నిబందనలను సడలించిన క్రమంలో గత వారం నుంచి యథావిధిగా గ్రీవెన్స్‌డే ప్రారంభించారు. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం గ్రీవెన్స్‌డేను నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement