అంబేడ్కర్‌కు నివాళి
సాక్షి, చైన్నె: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 69వ వర్ధంతిని పరష్కరించుకుని ఆయన విగ్రహాలకు, చిత్ర పటాలకు శనివారం నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ చిత్ర పటానికి సీఎం స్టాలిన్ పుష్పాంజలి ఘటించి ఆయన రాజ్యాంగ నిర్మాణంలో పాత్ర, సేవలను గుర్తు చేశారు. వాడవాడల్లోని ఆయన విగ్రహాలకు డీఎంకే, వీసీకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, అన్నాడీఎంకే వర్గాలు నేతృత్వంలో నివాళులర్పించే కార్యక్రమాలు, సేవాకార్యక్రమాలు జరిగాయి. చైన్నెలోని అంబేడ్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై నేతృత్వంలో పార్టీ వర్గాలు, ఎండీఎంకే నేత వైగో నేతృత్వంలో పార్టీ వర్గాలు వేర్వేరుగా నివాళులర్పించారు. చైన్నె కోయంబేడు, రాజా అన్నామలైపురంలోని విగ్రహానికి పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నేతలు, సంఘాల ప్రతినిధులు తరలివచ్చి అంజలి ఘటించారు. తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్, ప్రధాన కార్యదర్శి జీఆర్ వెంకటేష్ పుష్పాంజలితో నివాళులర్పించారు. పనయూరు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్ర పటానికి టీవీకే నేత విజయ్ నేతృత్వంలో ఆపార్టీ వర్గాలు, కోయంబేడులోని కార్యాలయంలో డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలో పార్టీ వర్గాలు అంజలి ఘటించాయి.
అంబేడ్కర్‌కు నివాళి


