కన్వీనర్ పదవికి వేడుకోలు
సాక్షి, చైన్నె: తనకు అన్నాడీఎంకేలో మళ్లీ సమన్వయకర్త పదవి అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఆ పార్టీ బహిష్కృత నేత, మాజీ సీఎం పన్నీరుసెల్వం విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన పన్నీరుసెల్వం ఆ పార్టీ అధిష్టానానికి గడువు విధిస్తూ అల్టిమేటం ఇచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను రెండురోజుల క్రితం పన్నీరుసెల్వం కలిశారు. ఆయన రాజకీయ అభయాన్ని ఇచ్చినట్టు చర్చ ఊపందుకుంది. అదేసమయంలో తనను మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకున్న పక్షంలో పార్టీ సమన్వయ కర్త పదవిని మళ్లీ అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలన్న షరతును అమిత్‌షా ముందు పన్నీరుసెల్వం ఉంచినట్టు తెలిసింది. ఇది కార్యరూపం దాల్చేనా అన్నది వేచి చూడాల్సిందే.


