క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ
కొరుక్కుపేట: శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మధురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని రవాణా శాఖ మంత్రి శివ శంకర్ సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండు బస్సుల డ్రైవర్లు కాంట్రాక్ట్ డ్రైవర్లు కాదు, ప్రభుత్వ డ్రైవర్లు. గత 3 సంవత్స రాలలో జరిగిన ప్రధాన ఘటన ఇది విచిత్రమై న ప్రమాదం. ఈ ప్రమాదంలో ఏలా జరిగిందో దర్యాప్తు చేస్తున్నాం. ప్రభుత్వ బస్సులకు అనుభవజ్ఞులైన, అర్హత కలిగిన డ్రైవర్లను మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రతిపక్ష పార్టీలు మాపై ఏదో ఆరోపిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి డ్రైవర్లు , ఆపరేటర్లకు నిరంతర శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణను తాము మరింత పెంచుతాం, ఈ బస్సులు చా లా సంవత్సరాలుగా నడుస్తున్నాయి. వాటిలో అనుభవజ్ఞులైన డ్రైవర్లను ఉపయోగిస్తున్నాం. కొంత నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్లు పనిభారంలో ఉన్నారా లేదా అనే దాని పై కూడా దర్యాప్తు చేస్తామని ఆయన అన్నారు. మంత్రి వెంట మధురై మేనేజింగ్ డైరెక్టర్ ధర్శరవనన్, కుంభకోణం మేనేజింగ్ డైరెక్టర్ దశరథన్, అరుల్ సుందరేష్ కుమార్ ఉన్నారు.
గ్రూప్ –1 మెయిన్స్ పరీక్షల ప్రారంభం
సాక్షి, చైన్నె: గ్రూప్ –1 మెయిన్స్ పరీక్ష నిఘా నీడలో సోమవారం చైన్నెలో ప్రారంభమైంది. రెండు విడతలుగా ఈనెల 10వ తేదీ వరకు పరీక్ష జరగనుంది. వివరాలు.. సబ్ కలెక్టర్, డీఎస్పీ, వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్‌కమిషనర్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్, జిల్లా ఎంప్లాయ్‌మెంట్ అధికారి, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ పోస్టుల భర్తీ నిమిత్తం ఏప్రిల్‌లో టీఎన్‌పీఎస్సీ నోటీఫికేషన్ జారీ చేసింది. వందలోపు పోస్టులకు గానూ సుమారు 2.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమినరీ పరీక్ష జూన్‌లోజరగ్గా 1.86 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో ఉత్తీర్ణులైన వారి వివరాలను ఆగస్టులో ప్రకటించారు. 1,843 మంది ఎంపిక మెయిన్స్‌కు అర్హత సాదించారు. వీరికి హాల్ టికెట్లను టీఎన్‌పీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా గత నెలాఖరులో విడుదల చేశా రు. వీరికి మెయిన్స్ పరీక్ష సోమవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. చైన్నెలో మాత్రమే 19 కేంద్రాలలో పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లను, నిఘా ను టీఎన్‌పీఎస్సీ చేసింది. గ్రూప్– 1 పోస్టులకు 1,2,3,4 పేపర్లకు సంబంధించిన పరీక్షలు నాలు గో తేదీ వరకు జరగనున్నాయి. ఆ తర్వాత గ్రూప్ –1ఏ పోస్టులకు గాను 8,9,10 తేదీలలలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఆమ్నీ బస్సు బోల్తా
– 8 మంది ప్రయాణికులకు గాయాలు
తిరువొత్తియూరు: పుదుచ్చేరి నుంచి చైన్నెకి ఆదివారం రాత్రి ఆమ్నీ బస్సు వస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వా మామల్లపురం సమీపంలోని కడుంబడి తూర్పు తీర రహదారిపై బలమైన గాలులు, వర్షం కురుస్తున్న సమయంలో అదుపు తప్పి బస్సు హఠాత్తుగా రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి బోల్తా పడింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన ప్రయాణికులు కేకలు వేశారు. సమాచారం అందుకున్న మామల్లపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వారు బస్సు ముందు అద్దాలు పగలగొట్టి లోపల చిక్కుకుపోయిన వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారి ని మామల్లపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మిగతా ప్రయాణికులందరినీ మరో బస్సులో చైన్నెకి పంపించారు. ఈ ప్రమాదంతో ఆప్రాంతంలో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఇప్పటి వరకు 8,022
ఎకరాల భూమి స్వాధీనం
– మంత్రి శేఖర్ బాబు
కొరుక్కుపేట: ద్రవిడ మోడల్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 3,896 దేవాలయాలలో కుంభాభిషేకం నిర్వహించారు. అలాగే అన్యాక్రాంతమైన రూ. 8,119 కోట్ల విలువైన 1,059 దేవాలయాలకు చెందిన 8,022.48 ఎకరాల భూమిని ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు తెలిపారు. వివరాలు.. తంజావూరు జిల్లాలో, బకోనంలో ప్రసిద్ధ మంగళాంబికై సమేత ఆదికుంబేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రతిష్ట జూన్ 5, 2009న జరిగింది. 16 సంవత్సరాల తర్వాత, ఈ ఆలయ కుంభాభిషేకం సోమవారం జరిగింది. హిందూ మత , దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు , ఉన్నత విద్యా శాఖ మంత్రి సర్ గోవి చెలియన్ జెండాను ఎగురవేసి కుంభాభిషేకం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనవరి నాటికి రాష్ట్రంలో దేవాలయాలలో కుంభాభిషేకాల సంఖ్య 4,000కు చేరుకుంటుందన్నారు. అలాగే 80 కొత్త రథాలు తయారు చేస్తున్నట్లు 600 దేవాలయాలలో రథాలకు రూ. 40 కోట్లతో మరమ్మతులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


