ఏఐ టెక్నాలజీతో పెద్ద టార్చర్
తమిళసినిమా: కథానాయకిగా దశాబ్దం కాలం పూర్తి చేసుకున్న యువ నటి కీర్తీసురేశ్. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ బ్యూటీ గత ఏడాది తన చిరకాల బాయ్‌ఫ్రెండ్‌తో మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు నడిచారు. అలా నటనకు చిన్న గ్యాప్ తీసుకున్న కీర్తీసురేశ్ ఇటీవల మళ్లీ నటించడం ప్రారంభించారు. కాగా ఈమె టైటిల్ పాత్రను పోషించిన రివాల్వర్ రీటా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా కీర్తీసురేశ్ ఓ భేటీలో పేర్కొంటూ చాలా కాలం తరువాత తాను నటించిన తమిళ చిత్రం విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. ఇది తాను నటించిన ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం అని పేర్కొన్నారు. అయితే సినిమా పరిశ్రమలో పురుషాధిక్యత కొనసాగుతోందని, హీరోలో నటించిన చిత్రాలకే అభిమానులు వస్తారనీ అన్నారు. హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రాలు బాగుంటేనే ప్రేక్షకులు చూస్తున్నారని అన్నారు. కాగా ఇంతకు ముందు హిందీలో ఒక చిత్రం, ఒక వెబ్ సిరీస్ చేశానని చెప్పారు. ప్రస్తుతం తెలుగులో విజయ్‌దేవరకొండకు జంటగా ఒక చిత్రం చేస్తున్నానని, అదే విధంగా మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నట్లు చెప్పారు. ఇవి వచ్చే ఏడాది వరుసగా తెరపైకి వస్తాయని చెప్పారు. ఏఐ టెక్నాలజీ గురించి ప్రస్తావిస్తూ అది పెద్ద టార్చర్‌గా మారిందన్నారు. తనకు ఒక చెడ్డ అలవాటు ఒకటుందని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయ్యే రీల్స్ ఎక్కువగా చూస్తానని చెప్పారు. వాటిని తన భర్తకు షేర్ చేస్తానన్నారు. వాటిని చూసిన ఆయన ఇవి ఏఐ టెక్నాలజీతో రూపొందించినవి అని తెలియడం లేదా? అని తనను ఆట పట్టిస్తారన్నారు. ఇటీవల తాను తప్పుగా పోజ్ ఇచ్చినట్లు ఏఐ స్టిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యిందన్నారు. అది తనకే ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అలా మనుషులు కనిపెట్టిన టెక్నాలజీ మనుషులకే ముప్పుగా మారిందని కీర్తీసురేశ్ అన్నారు. తన భర్తకు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదని, అయినా ఆయన తనకుంటే ఎక్కువగా చిత్రాలు చూస్తారని చెప్పారు. తనను పెళ్లికి ముందు ఆ తరువాత వ్యత్యాసం గురించి అడుగుతున్నారని, అయితే తనకు అలాంటి వ్యత్యాసం ఏమీ తెలియడం లేదన్నారు. తాను 15 ఏళ్లుగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్లనో ఏమో పెద్దగా వ్యత్యాసం తెలియడం లేదని ఆమె పేర్కొన్నారు.
రియోరాజ్ హీరోగా
రామ్ ఇన్ లీలా
తమిళసినిమా: యువ నటుడు రియోరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి రామ్ ఇన్ లీలా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 2019లో నెంజముండు నేర్మైయుండు ఓడు రాజా చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన నటుడు రియోరాజ్. ఆ తరువాత ప్లాన్ పన్ని పన్ననుమ్, జో, స్వీట్‌హార్ట్ చిత్రాల్లో నటించారు. ఇటీవల ఈయన హీరోగా నటించిన ఆన్‌పావం పొల్లాదదు చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా తన నూతన చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈవా ఎంటర్‌టెయిన్‌మెంట్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థల అధినేతలు ఆర్.రవీంద్రన్, సుందర్శన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రియోరాజ్‌కు జంటగా వర్తిక అనే నమ నటి నాయకిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ చిత్రం ద్వారా రామచంద్రన్ కన్నన్ దర్శకుడిగా పరిచచం అవుతున్నారు. అంకిత్ మీనన్ సంగీతాన్ని ,మల్లిఖార్జున్ ఛాయాగ్రహణంను అందిస్తున్న ఈ చిత్ర టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ఇది సాధారణ లవ్ స్టోరీ కాదు తన రామ్ ఇన్ లీలా అర్థం చేసుకోండి అంటూ నటుడు రియోరాజ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ చిత్రం విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది.
ఏఐ టెక్నాలజీతో పెద్ద టార్చర్


