ప్రచారం
ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య
తిరుత్తణి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో మనస్తాపానికి గురైన యువతి సూసైడ్ నోట్ రాసివుంచి ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుత్తణి ప్రాంతంలో విషాదాన్ని మిగిల్చింది. తిరువలంగాడు యూనియన్ లక్ష్మాపురం గ్రామానికి చెందిన సెల్వం రైతు. ఇతనికి ఇద్దరుకుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో చిన్న అమ్మాయి హరిత(19) తిరుత్తణిలోని ప్రయివేటు డిప్లొమా నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదివేది. ఈక్రమంలో శుక్రవారం కళాశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన హరిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కనకమ్మసత్రం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న గదిలో యువతి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. అందులో అమ్మా నువ్వు చాలా కష్టాలు భరించారు. ఇకపై నీకు కష్టాలు పెట్టేందుకు నేను సిద్దంగా లేను. అక్క, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. నమ్ముకున్న ప్రేమ నన్ను జీవించాలనే ఆశ లేకుండా చేసింది. తన చావుకు గోవిందమ్మ కారణమే, శిక్ష పడేలా చేయాలని రాసిన సూసైడ్‌నోట్ గుర్తించారు. ప్రేమించి మోసం చేసిన చిత్తూరు జిల్లా మేట్టుపాళ్యంకు చెందిన దిలీప్(25) అనే యువకుడు లక్ష్మాపురంలోని అతని బంధువు గోవిందమ్మ ఇంటికి వచ్చి వెళ్లే సమయంలో వారి మధ్య ప్రేమ చోటుచేసుకున్నట్లు, అయితే నగలు, నగదు ఇస్తేనే పెళ్లి చేసుకోవాలని దిలీప్‌కు గోవిందమ్మ చెప్పడంతో హరితను వివాహం చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. అంత మొత్తం ఇవ్వలేని స్థితిలో హరిత ఆత్మహత్య చేసుకుంది. హరిత మృతికి కారణమైన గోవిందమ్మ, దిలీప్‌ను అరెస్టు చేయాలని బంధువులు పట్టుబడ్డారు. కనకమ్మసత్రం పోలీసులు పరారీలో వున్న దిలీప్ కోసం గాలిస్తున్నారు.
ప్రచారం


