పరిశోధన కేంద్రం
సదరన్ రైల్వేలో జాతీయ ఐక్యతా దినోత్సవం
కొరుక్కుపేట: భారతదేశ ఏకీకరణలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని సదరన్ రైల్వే ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించింది. సదరన్ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్‌ఎన్. సింగ్, అదనపు జనరల్ మేనేజర్ విపిన్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ కె.హరికష్ణన్ పాల్గొని సదరన్ రైల్వే ప్రధాన కార్యాలయ అధికారులు, సిబ్బంది చేత ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం పురస్కరించుకుని సదరన్ రైల్వేలోని ఆరు డివిజన్లు, వర్క్‌షాప్‌లు, ఫీల్డ్ యూనిట్లలో జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకున్నారు.
పరిశోధన కేంద్రం


