
ఆషాఢ ఉత్సవాలు ప్రారంభం
తిరువళ్లూరు: ఆషాఢమాసం ఉత్సవాల్లో భాగంగా మొదటి శుక్రవారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో ఆషాఢ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మొదటి శుక్రవారం రోజున పుట్లూరు అంకాళపరేమేశ్వరి, తిరువేర్కాడు కరుమారియ్మన్, పెద్దపాళెం భవానీ అమ్మవారు, కాట్టుచెల్లియమ్మన్ ఆలయంతో పాటు గ్రామాల్లోని అన్ని అమ్మవారి ఆలయాల్లో భక్తులు రద్దీ ఏర్పడింది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పాలాభిషేకం, అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. పెద్దపాళెంలోని భవానీ అమ్మవారి ఆలయంలో ఆషాఢ ఉత్సవాలకు మొదటి శుక్రవారం రోజు అంకురార్పణ చేశారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి మహాభిషేకం, అలంకరణ, గోపూజ, దీపారాధన చేశారు.