సమస్య పరిష్కారం కోసం రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

సమస్య పరిష్కారం కోసం రాస్తారోకో

Jul 19 2025 1:19 PM | Updated on Jul 19 2025 1:19 PM

సమస్య పరిష్కారం కోసం రాస్తారోకో

సమస్య పరిష్కారం కోసం రాస్తారోకో

వేలూరు: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తమిళనాడు ప్రాథమిక పాఠశాల టీచర్ల సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోకు ఆ సంఘం జిల్లా కార్యదర్శి జోసెఫ్‌ అన్నయ్య, కుప్పురామన్‌ అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయులు ఉన్నపళంగా రోడ్డు కు అడ్డంగా కూర్చొని రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు చేసేది లేక టీచర్లను అరెస్ట్‌ చేసి ప్రైవేటు కళ్యాణ మండపంలో ఉంచారు. ఆ సంఘం సభ్యులు సరస్వతి, స్టీఫెన్‌, తమిళనాడు ఒకేషనల్‌ టీచర్స్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దనన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement