
క్లుప్తంగా
ఆంధ్ర వ్యక్తి కిడ్నాప్
తిరువళ్లూరు: ఉపాధి కోసం వచ్చిన సోదరుడ్ని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు ఆంధ్రాకు చెందిన వ్యక్తి కోయంబేడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన అన్నపురెడ్డి ఏసుబాబు(24) ఉపాధి కోసం గత 14వ తేదీన కోయంబేడు వచ్చాడు. అతడిని కొందరు కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురి చేసినట్టు తెలుస్తుంది. చిత్రహింస పెట్టుతున్న సమయంలో వీడియో తీసి, బాధితుడి అన్న అన్నపురెడ్డి దుర్గారావుకు పంపారు. తమకు రూ.లక్ష ఇవ్వాలని లేని, పక్షంలో హత్య చేస్తామని బెదిరించారు. దీంతో దుర్గారావు రూ.40 వేలు కిడ్నాపర్లకు పంపి, తన సోదరుడ్ని వదిలేయాలని కోరాడు. అందుకు వారు నిరాకరించడంతో అతడు కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోయంబేడులోని సీసీటీవీ పుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు.
మీతో సీఎం స్టాలిన్ కార్యక్రమానికి విశేష స్పందన
తిరువళ్లూరు: పట్టణంలోని ఒకటి, రెండు వార్డులకు సంబంధించి ఓ ప్రైవేటు కల్యాణమండపంలో నిర్వహించిన మీతో సీఎం స్టాలిన్ కార్యక్రమానికి విశేష స్పందనం లభించింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ తదితరులు హాజరై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా ప్రజల నుంచి స్వీకరించిన వినతి పత్రాలకు 45 రోజుల్లో పరిష్కారం చూపనున్న క్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు హాజరై, తమ సమస్యల పరిష్కారానికి వినతి పత్రాలు సమర్పించారు. ఆర్డీఓ రవిచంద్రన్ మున్సిపల్ కమిషనర్ దామోదరన్, చైర్‌పర్సన్ ఉదయమలర్, కౌన్సిలర్‌లు అరుణజైకృష్ణ, వసంతి, తహసీల్దార్ రజినీకాంత్, డీటీ దినేష్, ఆర్‌ఐ సుకన్య, గ్రామ నిర్వాహణ అధికారులు శేఖర్, భారతి, కుమరేషన్, అరవింద్ పాల్గొన్నారు.
భారీ అగ్ని ప్రమాదం
తిరువళ్లూరు: ప్రైవేటు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో రూ. కోట్ల ఆస్తి నష్టం వాట్లిల్లింది. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి చింతలకుప్పంలో చైన్నె క్రంప్ ఇండస్ట్రీస్ అనే సంస్థలో ఇనుము తయారు చేస్తున్నారు. ఈ కంపెనీకి సమీపంలోని ట్రాన్స్‌పార్మర్ నుంచి భారీ శబ్దం వచ్చిన క్రమంలో పరిశ్రమ నుంచి మంటలు వచ్చాయి. పరిశ్రమలోని వస్తువులు కాలిపోయాయి. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వచ్చిన గుమ్మిడిపూండి, సిప్‌కాట్ ప్రాంతానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ. కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది.
తిరుత్తణిలో 76 మి.మీ. వర్షం
తిరుత్తణి: పట్టణ పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి 76 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతలన్నీ జలమయమయ్యాయి. దాదాపు గంటపాటు కురిసిన వర్షంతో పట్టణంలోని బజారువీధి, గాంధీరోడ్డు, ఆర్ముగస్వామి వీధి, బైపాస్ సహా ప్రధాన రోడ్లలో వర్షపునీటితోపాటు మురుగునీరు కలిసి రోడ్లపై నిల్వ చేరడంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు, వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. అలాగే తిరుత్తణి ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాల ఆవరణలో వర్షపు నీరు గుంటను తలపించేలా నిల్వ చేరడంతో శుక్రవారం పాఠశాలకు వచ్చిన బాలికలు తరగతి గదులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తుపాకీ కాల్పుల్లో ఇద్దరి మృతి
అన్నానగర్: విక్రవాండి సమీపంలో ఓ న్యా యవాది తుపాకీతో నవవధువుతోపాటు మరో వ్యక్తిని కాల్చి చంపాడు. విల్లుపురం జిల్లా వి క్రవాండి సమీపంలోని వక్కూరు గ్రామానికి చెందిన తెన్నరసన్ (28)కు దిండివనం సమీపంలోని తెలి గ్రామానికి చెందిన లావణ్య (26)తో నెల రోజుల క్రితం వివాహమైంది. తెన్నరసన్ రోజూ తాగి ఇంటికి వచ్చేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ పరిస్థితిలో, గత 12వ తేదీన తాగి ఇంటికి వెళ్లినందుకు లావ ణ్య తెన్నరసన్‌ను మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన తెన్నరసన్ ఇంట్లో ఉంచుకున్న గన్ తీసి లావణ్యను కాల్చాడు. అతన్ని ఆపడానికి ప్రయత్నించిన తన తల్లి పచ్చయ్యమ్మాళ్‌పై కాల్పులు జరిపాడు. ఆ శబ్దం విని, పక్కనే అతడి బంధువు కార్తీక్ (28) తెన్నరసన్ వద్దకు వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నావని అడగ్గా తెన్నరసన్ అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో కార్తీక్ మరణించా డు. పోలీసులు తెన్నరసన్‌ను అరెస్టు చేశారు.
నగదు, గాజులు చోరీ
అన్నానగర్: రైల్వే అధికారి ఇంట్లో రూ.కోటి నగ దు, బంగారు గాజులను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. చైన్నెలోని నుంగంబాక్కంలోని వెలాస్ గార్డెన్ రోడ్డులోని ఒక అపార్ట్‌మెంట్‌లో రిటైర్డ్ రైల్వే చీఫ్ ఇంజినీర్ వెంకటచలం నివాసమున్నాడు. ఇతని ఇంట్లో రూ.కోటి నగదు, బంగా రు గాజులు చోరీ జరిగింది. ఈ విషయమై అయి రం విలక్కు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

క్లుప్తంగా

క్లుప్తంగా