
అమ్మవారికి ప్రత్యేక పూజలు
తిరుత్తణి: ఆడిమాసంలో తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుత్తణి అక్కయ్య వీధిలోని తణిగాచలమ్మ ఆలయంలో ఆడి తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అభిషేక పూజలు చేశారు. అమ్మవారు చందనం అలంకరణలో కనువిందు చేశారు. మహిళలు నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారికి కంకుమార్చన పూజలు చేశారు. శరవణ పుష్కరిణి సమీపంలోని దుర్గాదేవి ఆలయంలో వేకువజామున అమ్మవారికి అభిషేక పూజలు చేశారు. తిరుత్తణి మురుగన్ ఆలయంలో ఆడి శుక్రవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. మద్దూరులోని మహిషాసురమర్ధిని అమ్మవారి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది.
కానరాని చిరుత జాడ
పళ్ళిపట్టు : కాపు అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ ప్రాంతంలోని గ్రామీణులు భయాందోళన చెందుతున్నారు. దీంతో పళ్లిపట్టు అటవీశాఖ రేంజర్ క్లయ్‌మెంట్ ఎడిసన్ ఆధ్వర్యంలో అటవీశాఖాధికారులు గురువారం రాత్రి నొచ్చిలి కాపు అటవీ ప్రాంతంలో చిరుత జాడ కోసం కూంబింగ్ చేశారు. అటవీ ప్రాంతంలోని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. అయితే చిరుతకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని, ఇది కేవలం పుకార్లు మాత్రమేనని రేంజర్ తెలిపారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు