
మదర్‌థెరిసా ఆశయాలు ఆదర్శంగా తీపుకోవాలి
తిరువళ్లూరు: మదర్‌థెరిసా ఆశయాలకు ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని జననీ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య విద్యార్థులకు సూచించారు. తిరువళ్లూరు జిల్లా పాడియనల్లూరులోని మదర్‌థెరిసా నర్సరీ అండ్ ప్రైమరీ పాఠశాలలో కామరాజర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సెల్వకుమార్, గుడిమెట్ల చెన్నయ్య, తమిళనాడు తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు తమ్మినేని బాబు, కాపుసేవా సమితి ప్రధాన కార్యదర్శి కేశవులు, సామాజిక సేవకుడు సీహెచ్ ముకుందరావు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ముందుగా మదర్‌థెరిసా విగ్రహానికి, కామరాజర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో పీఆర్ కేశవులు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ప్రిన్సిపల్ మల్లిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మెట్రోలోకి ఎంఆర్‌టీఎస్
– త్వరితగతిన పనులకు ఉత్తర్వులు
సాక్షి, చైన్నె: మెట్రో రైలు గుప్పెట్లోకి ఎంఆర్‌టీఎస్ రైలు సేవలు చేరనున్నాయి. బీచ్ నుంచి వేళచ్చేరి – సెయింట్ థామస్ మౌంట్ వరకు మెటో సేవలే లక్ష్యంగా ఏర్పాట్లకు ఉత్తర్వులు జారీ చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. రాజధాని నగరం చైన్నెలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు తీవ్ర ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తూవస్తున్నది. ప్రధాన రవాణా మార్గాలుగా ఈఎంయూ (ఎలక్ట్రిక్ రైళ్లు) బీచ్ నుంచి తాంబరం, చెంగల్ప ట్టు, తిరుమాల్ పూర్ వరకు సేవల్ని అందిస్తున్నా యి. అలాగే, సెంట్రల్ మోర్ మార్కెట్ నుంచి తి రువళ్లురు, అరక్కోణం, గుమ్మిడి పూండి మార్గాల్లో ఈ రైళ్ల సేవలు అందుతున్నాయి. అలాగే, బీచ్ నుంచి వేళచ్చేరి వరకు ఎంఆర్‌టీ ఎస్ సేవలు సా గుతున్నాయి. ఈ రైలు సేవలను సెయింట్ థామ స్ మౌంట్ వరకు పొడిగించే పనులు ముగింపు ద శలో ఉన్నాయి. ఎంఆర్‌టీఎస్ రైలు సేవలు పూర్తి గా వంతెన మీద సాగుతుంది. తాజాగా, చైన్నెలో మెట్రో రైలు సేవల విస్తరణ ప్రయాణానికి మరింత సులభతరంగా మారిన నేపథ్యంలో తాజాగా ఎంఆర్‌టీఎస్‌ను మెట్రో రైలు గుప్పెట్లోకి తెచ్చేందుకు కసరత్తులు మొదలయ్యాయి.
మెట్రో చెంతకు..
దక్షిణరైల్వే పరిధిలో ఉన్న ఎంఆర్‌టీఎస్ సేవలను మెట్రో గుప్పుట్లోకి త్వరితగతిన తీసుకునే విధంగా సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. . దీంతో ఎంఆర్‌టీఎస్‌ను మెట్రో తన గుప్పెట్లోకి తీసుకున్న పక్షంలో నగరం చుట్టు రైలు సేవలకు ఆస్కారం ఉంది. ఇప్పటికే చైన్నెలో రెండు మార్గాలలో మెట్రో రైలు దూసుకెళ్తోంది. మరో మూడు మార్గాలలో 2027లో రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎంఆర్‌టీఎస్‌ను సైతం మెట్రో గుప్పెట్లోకి వచ్చిన పక్షంలో ఇదికూడా ఆధునిక హంగులతో వంతెన మార్గం సేవలకు ఉపయోగ పడ్డట్టే. ఈ దృష్ట్యా, త్వరలో అమలు కానున్న ఒకే టికెట్టుతో చైన్నె ప్రయాణానికి మరింత బలాన్ని చేకూర్చినట్టు అవుతుందని చెప్పవచ్చు.

మదర్‌థెరిసా ఆశయాలు ఆదర్శంగా తీపుకోవాలి