
అమ్మవారి ఆలయాల్లో ఆడి సందడి
తిరుత్తణి: ఆడి నెల గురువారం ప్రారంభం కావడంతో అమ్మవారి ఆలయాల్లో సందడి నెలకొంది. ఆడి నెల ప్రారంభం సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో ఉదయం పూజలు నిర్వహించి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పట్టణంలోని ఆర్ముగస్వామి వీధిలోని తణిగై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఉదయం అమ్మవారు చందనపు అలంకరణలో కనువిందు చేశారు.
ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పొంగళ్లు పెట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆడి నెల తొలి శుక్రవారం సందర్భంగా వేడుకలకు ఆలయ నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. తణిగాచలమ్మ ఆలయంలో పాటు దుర్గాదేవి ఆలయాల్లో వేడుకగా ఆడి నెల తొలిరోజు పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మద్దూరులోని మహిషాసురమర్ధిని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

అమ్మవారి ఆలయాల్లో ఆడి సందడి