
మీతో స్టాలిన్ శిబిరానికి పోటెత్తిన మహిళలు
పళ్ళిపట్టు: మీతో స్టాలిన్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన శిబిరానికి మహిళలు పోటెత్తారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు అందజేశారు. వివరాలు.. ప్రభుత్వ పథకాలన్నీ ఒకే చోట క్రోడీకరించి సేవలందించే విధంగా 13 శాఖల ద్వారా 46 సేవలు అందస్తున్న మీతో స్టాలిన్ పధకం శిబిరం పొదటూరుపేట టౌన్ పంచాయతీలో గురువారం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్న శిబిరంలో టౌన్‌లోని 18 వార్డుల్లో తొలి విడతలో 9 వార్డులకు సంబందించి ప్రజలు పాల్గొని దరఖాస్తులు అందజేసి ప్రభుత్వ పథకాలు, సహాయకాలు, సర్టిఫికెట్లు అందజేసేందుకు బారులుదీరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన శిబిరంలో 467 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే మహిళల పధకం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న రూ. వెయ్యి ఆర్థిక సాయానికి 750 మంది దరఖాస్తులు అందజేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే చంద్రన్ ప్రారంభించారు. ఇందులో టౌన్ పంచాయతీల సహాయ డైరెక్టర్ జయకుమార్, టౌన్ పంచాయతీ కార్యనిర్వహణాధికారి రాజకుమార్ పాల్గొన్నారు.