
ఆ ఇద్దరి కాంబోలో చిత్రం
కమల్ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్
తమిళసినిమా: విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన నటుడు కమలహాసన్ ఆ తరువాత శంకర్ దర్శకత్వంలో నటించిన ఇండియన్–2 చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. తాజాగా మరో భారీ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించడంలోపాటు కథానాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా స్టంట్ డైరెక్టర్స్ ద్వయం అన్బరివ్‌లను, దర్శకులుగా పరిచయం చేస్తున్నారు. అదేవిధంగా ఈ చిత్రం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏఐని తమిళ చిత్ర పరిశ్రమకు పూర్తిస్థాయిలో పరిచయం చేయనున్నారు.ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం కోసం నటుడు ఆ మధ్య అమెరికాలో ఏఐ టెక్నాలజీలో శిక్షణ పొంది వచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌న్స్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆగస్ట్‌లో చిత్రం సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. పూర్తిగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టెయినర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్‌ను ముఖ్యపాత్రలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
కల్యాణి
ప్రియదర్శన్
తమిళసినిమా: కుట్టి స్టోరీస్ పిక్చర్స్ పతాకంపై భువనేశ్ చిన్నస్వామి నిర్మిస్తున్న చిత్రం బుధవారం చైన్నెలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్రం యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి ఫ్రాంక్‌స్టర్ రాహుల్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు ఎంఎస్ భాస్కర్, ఫ్రాంక్‌స్టర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో అరుళ్‌దాస్, శ్రీనాథ్, శివ అరవింద్, ప్రియదర్శిని, అంజలిరావ్, అభినయ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీధర్ చాయాగ్రహణం, రంజన్‌రాజు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ విచిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ ఇది కామెడీతో కూడిన హర్రర్, ఫాంటసీ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి మెట్రో మురళి, మెట్రో గిరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పార్కింగ్ చిత్రంతో చాలా పాపులర్ అయిన భాస్కర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా హాస్య నటుడిగా పాపులర్ అయిన ఫ్రాంక్‌స్టర్ రాహుల్ కలిసి నటించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొంటున్నాయని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు వారు చెప్పారు.

ఆ ఇద్దరి కాంబోలో చిత్రం

ఆ ఇద్దరి కాంబోలో చిత్రం