క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jul 18 2025 5:16 AM | Updated on Jul 18 2025 5:16 AM

క్లుప

క్లుప్తంగా

చైన్నె వేదికగా సర్పేస్‌

అండ్‌ కోటింగ్‌ ఎక్స్‌ పో

సాక్షి, చైన్నె: చైన్నె వేదికగా సీఐఐ 5వ ఎడిషన్‌గా సర్పేస్‌ ఇంజినీరింగ్‌, తయారీ, కోటింగ్‌, ఫినిషింగ్‌, తప్పు రక్షణ, పర్యావరణ ఇంజినీరింగ్‌, సాంకేతికతల ఆవిష్కరణలతో సర్పేస్‌ అండ్‌కోటింగ్‌ ఎక్స్‌ పో 2025 గురువారం ప్రారంభమైంది. ఎక్స్‌పో చైర్మన్‌, హెచ్‌బీఎన్‌ఐ వీసీ డాక్టర్‌ యు. కామాచ్చి మొదలి, సీఐఐ సదరన్‌ రీజియన్‌ డిప్యూటీ చైర్మన్‌ పి రవిచంద్రన్‌, సీఐఐ తమిళనాడు స్టేట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఏఆర్‌ ఉన్ని కృష్ణన్‌లు ఈ ప్రదర్శనను ప్రారంభించారు. మూడు రోజుల పాటూ జరిగే ఈ ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా సర్పేస్‌ కోటింగ్‌ పరిశ్రమలోని వాటాదారులు, తయారీ దారులు, పంపిణీ దారులు, సొల్యూషన్‌ ప్రొవైడర్లు, వర్తకులు, వినియోగదారులు, విధాన రూపకర్తలు తరలి వచ్చారు. 300లకు పైగా ఎగ్జిబిటర్లు స్టాల్స్‌ను కొలువు దీర్చారు. కేవలం ప్రదర్శనగా కాకుండా, ఈ రంగం ప్రగతి, సాంకేతికతలను అందిపుచుకునే రీతిలో చర్చలు వంటి కార్యక్రమాలను ఈ మూడు రోజుల పాటుగానిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ఎక్స్‌పో ముఖ్యోద్దేశాలను వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

విద్యార్థినికి బెదిరింపులు

యువకుడి కోసం

పోలీసుల గాలింపు

తిరువొత్తియూరు: పుదుక్కోట్టై జిల్లాకు చెందిన ఆకాష్‌ అలియాస్‌ మొహమ్మద్‌ అబ్దుల్‌ (21) తిరువొత్తియూర్‌లోని పెరియార్‌ నగర్‌లో నివాసముంటున్న సమయంలో అదే ప్రాంతానికి ఓ విద్యార్థినిని ప్రేమించాడు. ఆ విద్యార్థి అతని అలవాట్లు బాగాలేవని చెప్పి మొహమ్మద్‌ అబ్దుల్‌తో స్నేహం మానేసినట్లు తెలుస్తోంది. దీంతో మొహమ్మద్‌ అబ్దుల్‌ తన స్వస్థలం పుదుక్కోట్టైకి వెళ్లాడు. ఈనేపథ్యంలో 2 రోజుల క్రితం, మొహమ్మద్‌ అబ్దుల్‌ విద్యార్థినికి ఫోన్‌ చేసి.. నాకు 2 లక్షలు కావాలి, లేకుంటే మన ఇద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానంటూ అని బెదిరించాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన విద్యార్థిని విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. విద్యార్థి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు ప్రకారం, తిరువొత్తియూర్‌ మహిళా పోలీసులు కేసు నమోదు చేసి మొహమ్మద్‌ అబ్దుల్‌ కోసం గాలిస్తున్నారు.

బంగారుగుడిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా

వేలూరు: వేలూరు శ్రీపురంలోని బంగారుగుడిని ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రి, సినీ నటి ఆర్‌కే రోజా బుధవారం సాయంత్రందర్శించుకున్నారు. ముందుగా బంగారుగుడి అద్వర్యంలో నడుస్తున్న నారాయణి పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో కలుసుకున్న ఆమె బంగారుగుడిలోని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతి శక్తిఅమ్మను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్బగా పీఠం నిర్వహకులు ఆమెకు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.

టీచర్‌ ఇంట్లో

45 సవర్ల బంగారం చోరీ

తిరువొత్తియూరు: విరుదునగర్‌ జిల్లా అరుప్పుకోట్టై సమీపంలోని పలవనాథం వడక్కుపట్టి కి చెందిన సుదర్శన్‌ పెరియవల్లికులంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య గాయత్రి. వారికి ఇద్దరు కుమారులు, గాయత్రి ఇంటిలో ఆమె పెద్దమ్మ సుబ్బులక్ష్మి ఉన్నారు. సంఘటన జరిగిన రాత్రి వారు ఇంటికి తాళం వేసి మిద్దె పై మీద పడుకున్నారు. ఇంటి లోపల సుబ్బులక్ష్మి ఒక్కరే నిద్రపోతున్నారు. ఆ సమయంలో, ఆమె ధరించిన 3 సవర్లు బంగారు నగలను తీసి సమీపంలో ఉంచింది. మరుసటి రోజు ఉదయం, సుబ్బులక్ష్మి నిద్ర లేచి చూడగా ఆమె నగలు కనిపించలేదు. దీని గురించి గాయత్రికి చెప్పింది. దీంతో గాయత్రి గదికి వెళ్లి బీరువా తెరచి చూడగా చైన్‌, చెవిపోగులు, ఉంగరం , డాలర్లు సహా 45 సవర్లు నగలు, రూ. 50,000 నగదు చోరీ అయినట్లు గుర్తించారు. ఈమేరకు గాయత్రి దీనిపై బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాపు అటవీ ప్రాంతంలో చిరుత?

పళ్లిపట్టు: కాపు అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు తెలియడంతో అటవీ ప్రాంత గ్రామీణులు భయాందోళన చెందుతున్నారు. పళ్లిపట్టు సమీపం నొచ్చిలి, కప్పూర్‌కండ్రిగ, కాకళూరు ప్రాంతాలు అటవీ ప్రాంతంలో ఉన్నాయి. ఈక్రమంలో బుధవారం సాయంత్రం కాకళూరు నుంచి నొచ్చిలికి వెళ్లే కొండకు మధ్యలోని రోడ్డులో వెళ్లుతున్న వాహనదారులు చిరుతను అటవీ ప్రాంతంలో చూసినట్లు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసి పళ్లిపట్టు అటవీశాఖ అధికారులు నొచ్చిలి కాపు అటవీ ప్రాంతంలో చిరుత జాడపై నిఘా పెట్టారు.

క్లుప్తంగా1
1/1

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement