
ఐదుగురిపై గూండా చట్టం నమోదు
తిరువళ్లూరు: నాటుబాంబులతో దాడి చేసి ఒకరిని హత్య చేసిన కేసులో నిందితులు ఐదుగురిపై గూండా చట్టాన్ని ప్రయోగిస్తూ తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరువళ్లూరు జిల్లా పేరంబాక్కం గ్రామానికి చెందిన ముఖేష్(25) గ్యాస్ డెలీవరి బాయ్. ఈక్రమంలో గత 25వ తేదీన ముఖేష్ ఇంటి వద్ద నిలబడి ఉన్న అతనిపై నాటుబాంబులు విసిరి హత్య చేశారు. మప్పేడు పోలీసులు కేసు విచారణ ప్రారంభించారు. విచారణలో పేరంబాక్కం గ్రామానికి చెందిన ఆకాష్(19), ఇరుళంజేరి గ్రామానికి చెందిన తరుణ్(19), చిన్నమండలి గ్రామానికి చెందిన మనీష్(21), కుమారచ్చేరి గ్రామానికి చెందిన వసంతకుమార్(23), పేరంబాక్కం గ్రామానికి చెందిన సతీష్(22)లను నిందితులుగా గుర్తించారు. ప్రస్తుతం పుళల్ జైలులో వున్న నిందితులపై గూండా చట్టాన్ని ప్రయోగించాలని ఎస్పీ శ్రీనివాసపెరుమాల్, కలెక్టర్ ప్రతాప్‌కు సిఫార్సు చేసిన క్రమంలో నాటుబాంబులను విసిరి ఒకరి హత్యకు కారణమైన ఐదుగురిపై గూండా చట్టాన్ని ప్రయోగిస్తూ కలెక్టర్ ప్రతాప్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.