
ఆవిష్కరణల్లో మద్రాస్ ఐఐటీ మేటి
సాక్షి, చైన్నె: ఆవిష్కరణల్లో మద్రాస్ ఐఐటీ మేటి అని వక్తలు అభిప్రాయపడ్డారు. తాజాగా అత్యంత తేలికై న యాక్టివ్ వీల్‌చైర్‌ను ఐఐటీ మద్రాసు ఆవిష్కరించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించబడిన ఈ వైడీ ఒన్, అల్ట్రా–లైట్ వెయిట్, ప్రెసిషన్–ఇంజినీరింగ్ డిజైన్‌తో తీర్చిదిద్దినట్టు ఐఐటీ మద్రాసు బుధవారం ప్రకటించింది. యాక్టివ్ వీల్‌చైర్ దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన ప్రెసిషన్–బిల్ట్ మోనో–ట్యూబ్ రిజిడ్–ఫ్రేమ్ వీల్‌చైర్ అని వివరించారు. కేవలం తొమ్మిది కిలో గ్రాముల బరువుతో రూపొందించామని పేర్కొన్నారు. కార్లు, ఆటోలు లేదా ప్రజా రవాణాలో నిర్వహించడం, ఉంచడం సులభతరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సర్జన్ వైస్ అడ్మిరల్ అనుపమ్ కపూర్, డైరెక్టర్ జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ (సాయుధ దళాలు) , ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి, ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాజెక్ట్ కో– ఆర్డినేటర్ డాక్టర్ మనీష్ ఆనంద్; ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శాస్త్రవేత్త డాక్టర్ రవీందర్ సింగ్ సమక్షంలో వైడీ వన్ ను ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రవంలో అడ్మిరల్ అనుపమ్ కపూర్ మాట్లాడుతూ, శ్ఙ్రీఐఐటీ మద్రాస్ లో, వస్తున్న ఆవిష్కరణలు, ఉత్పత్తులు ఒకొక్కటికి ఒక్కో ప్రత్యేకత ఉందన్నారు. అవి రోజువారీ ఉపయోగం కోసం, అత్యంత అవసరమైన వ్యక్తుల కోసం ఉపయోగ పడుతున్నాయన్నారు. సాయుధ దళాలకు ఐసీఎంఆర్ ద్వారా అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ మంజూరు చేసినట్లు ఈసందర్భంగా పేర్కొన్నారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మాట్లాడుతూ , శ్ఙ్రీమన దేశ శ్రేయస్సుకు సమ్మిళిత సమాజం ప్రాథమికమైనది, దానిని నిర్ధారించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించాలిశ్రీ అని వ్యాఖ్యలుచేశారు. ఈ ప్రయాణంలో నిబద్ధతకు తాజా ఆవిష్కరణ మరో నిదర్శంనగా వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి టీటీకే సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైస్ డెవలప్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ సుజాత శ్రీనివాసన్ మాట్లాడుతూ, శ్ఙ్రీ10 సంవత్సరాల క్రితం ఆర్2డీ2 స్థాపించినట్టు, ప్రతిచోటా వీల్‌చైర్ వినియోగదారులకు సరసమైన ఎంపికలు, స్వేచ్ఛను అందించడానికి స్టార్టప్‌లతో (మొదటి నియోమోషన్, ఇప్పుడు థ్రైవ్ మొబిలిటీ) కలిసి పనిచేయడం ఎంతో గర్వకారణంగా పేర్కొన్నారు. మద్రాస్–ఇంక్యుబేటెడ్ స్టార్టప్ అయిన థ్రైవ్ మొబిలిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుని వీల్‌చైర్‌లను స్థానికంగా ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నట్టు వివరించారు.