
ఆయిల్ లారీ బోల్తా
తిరువళ్లూరు: పెద్దపాళ్యం నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఆయిల్ లారీ కాకలూరు వద్ద ప్రమాదానికి గురైంది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పెద్దపాళ్యంలోని గోదాము నుంచి బెంగళూరుకు 21 క్వింటాల్ ఆయిల్‌తో లారీ బుధవారం రాత్రి బయలుదేరింది. లారీని వేలూరుకు చెందిన విజయన్(34) నడిపాడు. ఉదయం తిరువళ్లూరు సమీపంలోని కాకలూరు వద్దకు రాగానే లారీ బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయమైంది. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు క్రేన్ సాయంతో లారీని బయటకు తీశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు.