
బ్లాక్ కాంబో రిపీట్
తమిళసినిమా: ఇంతకుముందు నటుడు జీవా హీరోగా కేజీ.బాలసుబ్రమణి దర్శకత్వం వహించిన బ్లాక్ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా అదే కాంబినేషన్లో మరో చిత్రం రూపొందుతోంది. ఇది నటుడు జీవా కథానాయకుడిగా నటిస్తున్న 46వ చిత్రం. దీన్ని కేఆర్ గ్రూప్ పతాకంపై కన్నన్ రవి నిర్మిస్తున్నారు. ముత్తుకుమార్ రామనాథన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే చైన్నెలో ప్రారంభమైంది. నటుడు విశాల్, నిర్మాత ఆర్‌బీ చౌదరి, తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రబియా కధూన్ నాయకిగా నటిస్తున్న ఇందులో బబ్లూ పృథ్విరాజ్, నైలాఉషా, ఆడుగళం నరేన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి ప్రవీణ్ బినాయ్ చాయాగ్రహణంను అందిస్తున్నారు. కథా, కథనాలు కొత్తగా ఉంటాయని, ప్రేక్షకులను అలరించే పలు ఆసక్తికరమైన సన్నివేశాలు ఇందులో చోటుచేసుకుంటాయని చెప్పారు. ఈచిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.