
సమస్యలను వెంటనే పరిష్కరించాలి
వేలూరు: ప్రజల నుంచి వచ్చే సమస్యలపై అధికారులు వెంటనే విచారణ జరిపి పరిష్కరించాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అఽధికారులను ఆదేశించారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలోని నాల్గవ జోన్ కస్పా ప్రాంతంలో జరిగిన మీతో స్టాలిన్ పథకాన్ని ఆమె ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం 13 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, ప్రజలు ఇచ్చే వినతులపై అక్కడిక్కడే విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు. అదేవిధంగా కార్పొరేషన్‌లోని అన్ని వార్డుల్లోను, అన్ని గ్రామ పంచాయతీలోను ఈ శిబిరాలు నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే కార్తికేయన్, సబ్ కలెక్టర్ సెంథిల్‌కుమార్, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, మేయర్ సుజాత, జోన్ చైర్మన్ వెంకటేశన్, తహసీల్దార్ వడివేల్ పాల్గొన్నారు.