
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
పళ్లిపట్టు: అత్తిమాంజేరిపేటలో తాగునీటి ఎద్దడికి నిరసనగా మహిళలు మంగళవారం రోడ్డెక్కారు. పళ్లిపట్టు యూనియన్‌లోని అత్తిమాంజేరిపేటలోని భారతీయార్ నగర్‌లో 300కు పైగా కుటుంబాలు ఉన్నయి. పంచాయతీ ద్వారా కులాయిల్లో తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈక్రమంలో పైపులైన్లు మూడు రోజుల కిందట విరగడంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పైపులైన్లు మార్చి తాగునీరు సరఫరా చేయాలని పంచాయతీ కార్యదర్శికి ఆ ప్రాంతం వాసులు కోరారు.అయితే ఇంత వరకు పైపులైన్లు మార్చక పోవడంతో అత్తిమాంజేరిపేట బస్టాండు వద్ద ప్రదాన రోడ్డులో ఖాళీ బిందెలు వుంచి రాస్తారోకో చేపట్టారు. వాహన సేవలకు అంతరాయం చోటుచేసుకోవడంతో పొదటూరుపేట పోలీసులు మహిళలతో మాట్లాడి వెంటనే తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు రాస్తారోకో విరమించారు.