
పెన్షనర్ల ఆందోళన
వేలూరు: దేశవ్యాప్తంగా పెన్షనర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు పెన్షనర్లు సంఘం ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఆందోళనకు సంఘం జిల్లా కార్యదర్శి రవి, జిల్లా అధ్యక్షుడు పన్నీర్‌సెల్వం, కోశాధికారి జ్ఞానశేఖరన్ హాజరై ప్రసంగించారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రిష్ణమూర్తి మాట్లాడుతూ పే కమిషన్ సిఫారసులను మినాహాయించే ఫైనాన్స్ బిల్లు వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని, నాలుగు సెట్ల కార్మిక చట్టాలను రద్దు చేయాలని, పెన్షన్ ఫండ్ రెగ్యులేషన్ చట్టాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు వెంటనే తిరిగి చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పే కమిషన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఓకేషనల్ ప్రభుత్వ టీచర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్, సమన్వయ కమిటీ జిల్లా కార్యదర్శి లోకనాథన్ పాల్గొన్నారు.