సాక్షి, చైన్నె: సమ్మర్ ప్రాజెక్టు వేడుకలను విజయవంతంచేశామని మాస్కో నగర పర్యాటక కమిటీ మంగళవారం స్థానికంగా ప్రకటించింది. భారతీయ పర్యటకులను ఆకర్షించే విధంగా జూలై 3 నుంచి 13వ తేదీ వరకు మానేజ్నాయ స్క్వేర్ వేదికగా ఈ వేడుకలు జరిగినట్టు పేర్కొన్నారు. చేతి వృత్తి దారులను ప్రోత్సహించే విధంగా, భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయంచేసే రీతిలో ఈఉత్సవం విజయవంతంగా జరిగినట్టు వివరించారు. 500లకు పైగా జరిగిన కార్యక్రమాలలో 150 మందికి పైగా కళాకారులు, ప్రదర్శనలు ఇచ్చారన్నారు. మాస్కో నగర పర్యాటక కమిటీ అంతర్జాతీయ రంగంలో కూడా కీలకమైన పర్యాటక గమ్యస్థానంగా ముద్ర వేసుకుంటోన్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలను 82,500 మంది తిలకించినట్టు వివరించారు.