
ఘనంగా కామరాజర్ జయంతి
తిరుత్తణి: కాంగ్రెస్ నేత, దివంగత మాజీ సీఎం కామరాజర్ నాడార్ 123వ జయంతిని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం తిరుత్తణి నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని కామరాజర్ విగ్రహానికి పట్టణ అధ్యక్షుడు రామకృష్ణన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ త్యాగరాజన్, టీఎంసీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశన్, పళ్లిపట్టులో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శివకుమార్ నివాళులర్పించారు. పాఠశాలల్లో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
తిరువళ్లూరులో..
తిరువళ్లూరు: కామరాజర్ జయంతిని ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కామరాజర్ విగ్రహానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షుడు ఆనందన్, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌దాస్, ఓబీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేషన్, నగర అధ్యక్షుడు స్టాలిన్, వడివేలు పాల్గొన్నారు. అదేవిధంగా కామరాజర్ విగ్రహానికి బీజేపీ, నామ్‌తమిళర్, డీఎంకే, అన్నాడీఎంకే నేతలు సైతం నివాళులర్పించారు.
ఎస్‌కేపీడీలో..
కొరుక్కుపేట: చైన్నె జార్జి టౌన్‌లోని ఎస్‌కేపీడీ బాలుర మహోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మైలాపూర్ డీజీపీ ఆఫీస్ క్యాంపస్‌లోని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ టి. శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె జెమిని మాజీ అధ్యక్షుడు ఎ. వెంకటకృష్ణన్ విచ్చేసి కామరాజర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. పాఠశాల కరస్పాండెంట్ ఎస్‌ఎల్ సుదర్శనం విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. హెచ్‌ఎం లీలారాణి, సుజాత పాల్గొన్నారు.

ఘనంగా కామరాజర్ జయంతి

ఘనంగా కామరాజర్ జయంతి