
తిరుత్తణి ఆలయంలో భక్తుల రద్దీ
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆవణి నెల చివరి మంగళవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామిని దర్శించుకునేందుకు మంగళవారం అనువైన రోజు కావడంతో పాటు ఆవణి నెల చివరి మంగళవారం సందర్భంగా వేకువజామున మూలవర్లకు అభిషేక పూజలు చేపట్టి బంగారు కవచంతో అలంకరించి దీపారాధన పూజలు జరిగాయి. ఉదయం నుంచే భక్తులు రాక పెరగడంతో కొండ ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. ఉచిత దర్శన క్యూలలో మూడు గంటల పాటు, రూ. వంద ప్రత్యేక దర్శన మార్గంలో రెండు గంటలు భక్తులు వేచివుండి స్వామిని దర్శించుకున్నారు. ఎండల తీవ్రత నేపఽథ్యంలో ఆలయం ద్వారా భక్తులకు తాగునీరు సరఫరా చేయడంతో పాటు ఉదయం ప్రసాదాలు అందజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 35 వేల మంది భక్తులు స్వామి సేవలో పాల్గొన్నారు. గురువారం ఆడి నెల ప్రారంభం కానున్న నేపథ్యంలో కొండ ఆలయంకు భక్తులు తాకిడి విపరీతంగా పెరగనున్న క్రమంలో ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.

తిరుత్తణి ఆలయంలో భక్తుల రద్దీ