
సర్వాతో బీమా సేవలు విస్తృతం
సాక్షి,చైన్నె: సర్వాతో ఆరోగ్య బీమా సేవలను విస్తృతం చేశామని, అవార్డును సైతం గెలుచుకున్నామని మనిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెంటింగ్‌ఆఫీసర్ సప్నా దేశాయ్ తెలిపారు. మంగళవారం స్థానికంగా ఆసంస్థ ముఖ్య నిర్వాహకులు ఆశీష్ యాదవ్, తర్వేజ్ మహ్మద్‌లతో కలిసి 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సాధించిన 30 శాతం ప్రీమియం వృద్ధి, తమిళనాడులో జనవరి నుంచి మే వరకు జరిగిన కార్యకలాపాలలో 52 శాతం సర్వా వాటా, ఎఫ్‌వై 25లో తమిళనాడులో 11 లక్షలకు పైగా జీవితాలకు కవర్ చేసే విధంగా కార్యక్రమాలు, రాష్ట్రంలో 18 కార్యాలయాల ద్వారా 7 వేల మంది బీమా సలహాదారుల పరిధిని విస్తృతం చేయడమే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయాలను మీడియాకు సప్నా దేశాయ్ వివరించారు. సర్వా ఆరోగ్య సంరక్షణకు తోడ్పాటు బీమాగా మారిందని ప్రకటించారు. సర్వా ఉత్తమ్ అనంత్, సర్వా పరమ్ డే, సర్వా ప్రథమ్ వినియోగదారులకు ఆరోగ్యపరంగా, అత్యవసర సేవల పరంగా అండగా నిలుస్తుందన్నారు. రానున్న రోజులలో తమిళనాడులో సర్వా బీమా సేవలను విస్తృతం చేస్తున్నామని, ఇందులోభాగంగా లోగోను ఆవిష్కరించినట్టు పేర్కొన్నారు.