
తిరుత్తణిలో అన్నాడీఎంకే ధర్నా
తిరుత్తణి: డీఎంకే ప్రభుత్వంలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని, హామీలు ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రచారాలకు మాత్రం పరిమితమవుతున్నట్లు ఆరోపిస్తూ అన్నాడీఎంకే ఆధ్వర్యంలో తిరుత్తణిలో సోమవారం ధర్నా చేపట్టారు. ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, మాజీ ఎంపీ హరి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో తిరుత్తణి నియోజకర్గం వ్యాప్తంగా నుంచి రెండు వేల మందికి పైగా అన్నాడీఎంకే శ్రేణులు పాల్గొన్నాయి. ఇందులో మాజీ మంత్రులు జయకుమార్, రమణ పాల్గొని, డీఎంకే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.