శరవేగంగా సహాయక చర్యలు | - | Sakshi
Sakshi News home page

శరవేగంగా సహాయక చర్యలు

Jul 15 2025 6:45 AM | Updated on Jul 15 2025 6:45 AM

శరవేగ

శరవేగంగా సహాయక చర్యలు

మొదటి రెండు రైల్వే లైన్లు పునురుద్ధరణ

ఆలస్యంగా నడిచి రైళ్లతో ప్రయాణికుల ఇబ్బందులు

తిరువళ్లూరు: చైన్నె ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నుంచి మైసూరు వైపు బయలుదేరిన గూడ్స్‌ రైలులో మంటలు చెలరేగి తిరువళ్లూరు సమీపంలో భారీ అగ్నిప్రమాదం ఏర్పడడంతో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 8.40 లక్షల లీటర్లు ఆయిల్‌, 18 ట్యాంకర్‌లు దగ్ధమై దాదాపు రూ. 15 కోట్ల మేరకు నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. తిరువళ్లూరు సమీపంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌ రైల్వేట్రాక్‌ పూర్తిగా దెబ్బతింది. మరో రెండు లైన్లుకు సంబందించిన విద్యుత్‌ లైన్లు, సిగ్నల్‌బోర్డులు, రైల్వే ట్రాక్‌ దెబ్బతినడంతో పలు ఎక్స్‌ప్రెక్స్‌ రైళ్లు, లోకల్‌ రైళ్ల రాకపోకలను ఆదివారం ఉదయం నుంచి నిలిపివేశారు. మంటలను దాదాపు పది గంటల పాటూ శ్రమించి అధికారులు అదుపు చేశారు. అనతరం సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. పది ప్రొక్లెయిన్‌లు, జేసీబీలు, క్రేన్‌లు, భారీ యంత్రాల సాయంతో పనులను ప్రారంభించారు. తక్కువ ప్రమాద తీవ్రత వున్న మొదటి రెండు లైన్లు, ట్రాక్‌లను సరిచేసి సోమవారం ఉదయం రాకపోకలను పునరుద్ధరించారు. మరో రెండు లైన్లులో యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. ఈ పనులు సోమవారం రాత్రిలోపు వందశాతం పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు.

ఆలస్యంగా నడిచిన రైళ్లు

గూడ్స్‌ ప్రమాదం కారణంగా అన్ని ఎక్స్‌ప్రెక్స్‌, లోకల్‌ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణ రోజుల కంటే తక్కువ రైళ్లను నడపడంతో తిరువళ్లూరు, పుట్లూరు, సెవ్వాపేట, వేపంబట్టు, కడంబత్తూరు తదితర రైల్వేస్టేషన్‌లో రైళ్ల కోసం ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటూ రద్దీ ఎక్కువగా కనిపించింది. పలువురు ఉద్యోగులు రైళ్లు రాకపోకలు ఆలస్యంగా నడవడంతో సకాలంలో కార్యాలయాలకు చేరుకోలేక ఇబ్బందులు పడ్డారు. తిరువళ్లూరు, తిరుత్తణి, అరక్కోణం నుంచి తక్కువ సంఖ్యలో రైళ్లను నడిపారు. అయితే చాలా రైళ్లను తిరునిండ్రవూర్‌ వరకు నడిపి అక్కడ నుంచి చైన్నె, బీచ్‌, తామంబరం తదితర ప్రాంతాలకు రాకపోకలను కొనసాగించారు. కాగా కడంబత్తూరు రైల్వేస్టేషన్‌ నుంచి తిరువల్లూరు వరకు గంటకు పది కిమీ వేగంతో రైళ్లను నడిపారు. బృందావన్‌, డబుల్‌ డెక్కర్‌ లాంటి ఎక్స్‌ప్రెక్‌ రైళ్లు కడంబత్తూరు, తిరువళ్లూరులో ఆగి బయలుదేరింది. ప్రమాదంలో దెబ్బతిన్న కొన్ని ట్యాంకర్‌లో ఆయిల్‌ను ఓఎన్‌జీసీ లారీల ద్వారా తరలించగా, మిగిలిన ట్యాంకర్‌లను నూతన ఇంజిన్‌తో సోమవారం ఉదయం మైసూరుకు తరలించారు.

నమోదు కానీ ఎఫ్‌ఐఆర్‌

గూడ్స్‌ ప్రమాదంపై స్టేషన్‌ మాస్టర్‌ జీఆర్‌పీ పోలీసులకు పిర్యాదు చేయాల్సి ఉంది. అయితే ప్రమాదం జరిగి 36 గంటలు దాటుతున్నా ఇంత వరకు ఫిర్యాదు రాలేదని జీఆర్‌ పోలీసులు వివరించారు. తమకు ఫిర్యాదు వస్తే పూర్తి స్థాయిలో విచారణ చేస్తామన్నారు. ఇదే విషయంపై స్టేషన్‌ మాస్టర్‌ను వివరణ కోరగా, ఫిర్యాదు చేయలేదన్న మాటవాస్తవమే. ఎందుకు ఫిర్యాదు చేయలేదు.. ఎప్పడు చేస్తామనే విషయం తమకు తెలియదు. పూర్తి వివరాల కోసం ఉన్నత అధికారుల వద్ద వివరణ తీసుకోవాలన్నారు.

సహాయక చర్యలు ముమ్మరం

పగుళ్లే ప్రమాదానికి కారణం

గూడ్స్‌ రైలు ప్రమాదానికి ట్రాక్‌లో ఏర్పడిన పగుళ్లే ప్రమాదానికి కారణంగా వుండొచ్చన్న కోణంలో సాక్షి ట్రాక్‌లోని పగుళ్లు వున్న ఫొటోలతో సహా వార్తను ప్రచురించింది. ఈక్రమంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్‌ ప్రతాప్‌, గూడ్స్‌ రైలు ప్రమాదానికి ట్రాక్‌లో ఏర్పడిన పగుళ్లే కారణమని, కుట్రకోణం లేదని రైల్వేశాఖ ప్రాధమిక విచారణలో గుర్తించిందన్నారు. జిల్లా యంత్రాంగం సైతం లోతైన నివేదికను రైల్వే శాఖ నుంచి కోరామని, చివరిగా ఎప్పడు ట్రాక్‌ను పర్యవేక్షించారు. ట్రాక్‌లో ఏర్పడిన పగుళ్లను ఎందుకు గుర్తించలేదన్న విషయంపై సైతం నివేదిక కోరినట్టు వివరించారు. త్వరలోనే డీఆర్‌ఎంతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి భవిషత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

నేటి నుంచి యధావిధిగా రాకపోకలు

సోమవారం రాత్రికి సహాయక చర్యలను పూర్తి చేసి అన్ని రకాల రైళ్లను కాలయాపన లేకుండా కొనసాగించాలని నిర్ణయించినట్టు రైల్వే అధికారులు వివరించారు. అధికారులు సోమవారం రాత్రికి పనులు పూర్తి చేస్తే మంళవారం నుంచి అన్ని రకాల రైల్వే సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో మొదటి రెండు లైన్లులో దెబ్బతిన్న విద్యుత్‌ కనెక్షన్‌లను పునరుద్ధరించారు. పాక్షికంగా దెబ్బతిన్న సిగ్నల్‌బోర్డు, ట్రాక్‌లకు వేగంగా మరమ్మతులు చేపట్టారు. ప్రమాదం జరిగిన నాలుగవ ట్రాక్‌లో వున్న ట్యాంకర్‌లను భారీ క్రేన్‌ల సాయంతో తొలగించారు. అనంతరం మంటల తీవ్రతతో అరకిలోమీటర్‌ మేరకు దెబ్బతిన్న సిమెంట్‌ దిమ్మెలు, ట్రాక్‌లను తొలగించారు. వాటి స్థానంలో గుళకరాయిని పోసి కొత్త సిమెంట్‌ దిమ్మెలు, ట్రాక్‌, సిగ్నల్‌ బోర్డులు, విద్యుత్‌ లైన్లును ఏర్పాటు చేశారు.

శరవేగంగా సహాయక చర్యలు1
1/3

శరవేగంగా సహాయక చర్యలు

శరవేగంగా సహాయక చర్యలు2
2/3

శరవేగంగా సహాయక చర్యలు

శరవేగంగా సహాయక చర్యలు3
3/3

శరవేగంగా సహాయక చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement