రాష్ట్రంలో పెండింగ్‌ కేసుల సంఖ్య ఎంత? | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పెండింగ్‌ కేసుల సంఖ్య ఎంత?

Jul 15 2025 6:45 AM | Updated on Jul 15 2025 6:45 AM

రాష్ట్రంలో పెండింగ్‌ కేసుల సంఖ్య ఎంత?

రాష్ట్రంలో పెండింగ్‌ కేసుల సంఖ్య ఎంత?

● డీజీపి, కమిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు

కొరుక్కుపేట: చైన్నెలోని అల్లికుళం కోర్టులో విచారణలో ఉన్న కేసులో నిందితుడు రాజరాజ చోళన్‌ పై జారీ చేసిన అరెస్టు వారెంట్‌ను అమలు చేయడానికి నీలంకరై పోలీసుల అనుమతి కోరుతూ జమునా శివలింగం చైన్నె ఐఎస్‌ఓలో ఫిటీషన్‌ దాఖలు చేశారు . ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పి. వెల్మురగన్‌ మాట్లాడుతూ గత జనవరిలో జారీ చేసిన ఈ కేసులో పోలీసులు ఇంకా ఎలాంటి అరెస్టు వారెంట్లు జారీ చేయలేదన్నారు. కాగా అరెస్టు వారెంట్లు జారీ చేయబడిన అనేక కేసులు ఇప్పటికీ పెండింగ్‌ దశలోనే ఉన్నాయి. మేజిస్ట్రేట్‌, జిల్లా కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ల ఆదారంగా నిందితులను నిర్ధిష్ట వ్యవధిలోపు అరెస్టు చేసి సంబంధిత కోర్టు ముందు హాజరుపరుస్తారు. లేకపోతే వారెంట్‌ అమలు కాకపోవడంపై సంబంధిత కోర్టుకు నివేదిక దాఖలు చేసి కొత్త వారెంట్‌ జారీ కోసం అభ్యర్థన చేయాలి. ఈక్రమంలో తమిళనాడు అంతటా ఎన్ని కేసులలో అరెస్టు వారెంట్లు జారీ చేశారు. పెండింగ్‌లో ఎన్ని ఉన్నాయి అనేదానిపై డీజీపీ , చైన్నె పోలీసు కమిషనర్‌ ఈనెల 23 తేదీలోపు నివేదిక సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే తమిళనాడుఅంతటా ఎన్ని కేసులలో ఇంకా అరెస్టు వారెంట్లు అమలు చేయలేదో అనే దాని పై కూడా వివరణ ఇవ్వాలి అని పేర్కొంటూ విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ఉత్తర్వులిచ్చింది.

ఘనంగా ది గుడ్‌ డీడ్స్‌

2వ ఎడిషన్‌

ప్రారంభించిన గవర్నర్‌ రవి

సాక్షి, చైన్నె: ట్రాన్స్‌ జెండర్ల జీవితాలలో వెలుగు నింపే విధంగా, విద్య, ఉద్యోగ పరంగా శిక్షణకు తోడ్పాటు అందించే రీతిలో ది గుడ్‌ డీడ్స్‌ క్లబ్‌ ఛాంపియన్స్‌ విద్య సహకారం, స్కాలర్‌ షిప్‌ల పంపిణీ వేడుక చైన్నెలో జరిగింది. ఇందులో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు. సామాజిక సేవకురాలు అప్సర రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ది గుడ్‌ డీడ్స్‌ క్లబ్‌ రెండవ ఎడిషన్‌గా విద్య, సమ్మిళితం, జాతీ నిర్మాణం, శక్తివంతమైన దృష్టితో దాతృత్వం, సాంస్కృతికత, నెట్‌ వర్కింగ్‌ను విస్తృతం చేసే విధంగా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆర్థికంగా వెనుక బడిన యువతకు పూర్తి విద్య, వసతి, పోలీసు శిక్షణ కోసం నిధులు సమకూర్చడం లక్ష్యంగా రూ. 5 లక్షల విరాళంను వల్లమై ట్రస్ట్‌కు అందజేశారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లుగా శిక్షణతో జీవితాలను కొనసాగించడానికి అర్హులైన వారికి సహకారం అందించేందుకు నిర్ణయించారు. అలాగే ఇన్పర్మేషన్‌ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యషించేందుకు గాను ట్రాన్స్‌ ఉమెన్‌ మయూరకు రూ. లక్ష స్కాలర్‌ షిప్‌ అందజేశారు. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, గుడ్‌ డీడ్స్‌ క్లబ్‌ అధ్యక్షురాలు అప్సర రెడ్డి, వైస్‌ చైర్‌ పర్సన్‌ సింధూర అరవింద్‌ స్కాలర్‌ షిప్‌లను అందజేశారు.

న్యూస్‌రీల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement