
గ్లెనీగల్స్‌లో కంటి సంరక్షణా కేంద్రం
సాక్షి, చైన్నె: చైన్నెలోని గ్లెనీగల్స్ ఆస్పత్రిలో అత్యాధునిక కంటి సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం దీనిని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ వైస్ చైర్ పరస్సన్ డాక్టర్ సుధా శేషయ్యన్‌ప్రారంభించారు. ఈ ఐ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఈ రవీంద్ర మోహన్, గ్లెనీగల్స్ సీఈఓ డాక్టర్ నాగేశ్వరరావులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈసందర్బంగా రవీంద్ర మోహన్ మాట్లాడుతూ, సమగ్ర, బహుళ విభాగాలు, అధిక నాణ్యత కలిగిన కంటి సంరక్షణ అందించడం లక్ష్యంగా ఇక్కడ సెంటర్‌ఏర్పాటు చేశామన్నారు. నేత్ర వైద్య శాస్త్రాన్ని న్యూరాలజీ, ఆంకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ వంటి ఇతర ప్రత్యేకతలతో అనుసంధానించడం ద్వారా రోగులకుఒకే చోట అన్ని సేవలు అందించేందుకు వీలు కల్పించామన్నారు.