కుటుంబ కథా చిత్రాలు చాలా కష్టం | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కథా చిత్రాలు చాలా కష్టం

Jul 15 2025 6:45 AM | Updated on Jul 15 2025 6:45 AM

కుటుం

కుటుంబ కథా చిత్రాలు చాలా కష్టం

తమిళసినిమా: నటుడు విజయ్‌సేతుపతి, నిత్యామీనన్‌ జంటగా నటించిన చిత్రం తలైవన్‌ తలైవి. సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై టీజీ త్యాగరాజన్‌ సమర్పణలో సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మించిన ఈ చిత్రానికి పాండిరాజ్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 25వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని ట్రేడ్‌ సెంటర్‌లో భారీ ఎత్తున నిర్వహించారు. ఆదివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ ఒక విషయంలో తనకు దర్శకుడు పాండిరాజ్‌కు మధ్య ఏర్పడిన సంఘటన తరువాత చాలా కాలం ఇద్దరం మాట్లాడుకోలేదన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రారంభమైన చిత్రం తలైవన్‌ తలైవి అని పేర్కొన్నారు. చిత్రం ప్రారంభమైన తరువాత తమ మధ్య బేధాభిప్రాయాలు తొలగి మంచి స్నేహం ఏర్పడిందన్నారు. అయితే ఈ చిత్రం కోసం దర్శకుడు పాండిరాజ్‌ తమను చాలా కష్టపెట్టారని చెప్పారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించడానికి సమ్మతించినట్లు చెప్పారు. నటి నిత్యామీనన్‌ తాను 2018లో ఒక మలయాళ చిత్రంలో నటించామని చెప్పారు. అప్పుడే మరో చిత్రంలో కలిసి నటించాలని భావించామన్నారు. అది ఈ చిత్రంతో కుదిరిందని పేర్కొన్నారు. ఇది భార్యాభర్తలు విడిపోకూడదని చెప్పే కథగా ఉంటుందని చెప్పారు. చిత్ర దర్శకుడు పాండిరాజ్‌ మాట్లాడుతూ తలైవన్‌ తలైవి కుటుంబ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. నిజం చెప్పాలంటే కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడం చాలా కష్టం అన్నారు. ఈ తరహా చిత్రాలు కొంచెం మారినా సీరియల్స్‌గా మారే ప్రమాదం ఉందన్నారు. ఆ విషయంలో తాను చాలా సమయం తీసుకుని కథ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. ఇది భార్యాభర్తల మధ్య అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది ఒక యధార్థ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం అని చెప్పారు. నటుడు విజయ్‌ సేతుపతి చాలా బాగా నటించారని, అదే విధంగా నటి నిత్యామీనన్‌ లేకుంటే ఇందులోని పాత్రను ఊహించలేమన్నారు. ఇప్పటి వరకూ తాను అనుకున్న ఏ కథానాయకి తన చిత్రాల్లో నటించలేదనీ, ఈ చిత్రంలో మాత్రం ముందు నుంచి నిత్యామీనన్‌నే అనుకున్నాననీ, ఆమెనే నటించారని దర్శకుడు పాండిరాజ్‌ చెప్పారు.

తలైవన్‌ తలైవి చిత్రం యూనిట్‌

కుటుంబ కథా చిత్రాలు చాలా కష్టం1
1/1

కుటుంబ కథా చిత్రాలు చాలా కష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement