
శివప్పు మల్లి, నటి ముచ్చర్ల అరుణ ఇంట్లో ఈడీ సోదాలు
తమిళసినిమా: చైన్నెలోని నటి ముచ్చర్ల అరుణ ఇంట్లో బుధవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బహుభాషా నటి ముచ్చర్ల అరుణ.ఈమె తమిళంలో కళ్లుక్కుళ్ ఈరం చిత్రం ద్వారా నటిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత, కరవమేడు కరవాయన్ మొదలగు పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. అదే విధంగా తెలుగు, కన్నడం భాషల్లోనూ నటించారు. కాగా అరుణ, మోహన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తరువాత నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు. అదే విధంగా మళ్లీ కన్నడం, మలయాళం భాషల్లో నటించడం మొదలెట్టారు. ఇకపోతే అరుణ భర్త ఇంటీరియర్ డిజైనర్ కావడం గమనార్హం. ఈయనపై మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో బుధవారం చైన్నె, నీలాంగరై ప్రొంతంలోని ముచ్చర్ల అరుణ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది.