
మహిళా బృందాల ఉత్పత్తులపై అధ్యయనం
● స్వయం సహాయక బృందాలతో డిప్యూటీ సీఎం భేటీ
సాక్షి, చైన్నె: కరూర్ కార్పొరేషన్‌లో మహిళా స్వయం సహాయక బృందాల తయారు చేసే ఉత్పత్తులను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ బుధవారం అధ్యయనం చేశారు. అక్కడి ఉత్పత్తుల గురించి బృందాల సభ్యులతో సమావేశంలో అడిగి తెలుసుకున్నారు. వివరాలు.. కరూర్ కార్పొరేషన్‌లోని తిరునగర్ ప్రాంతంలో తలిర్ మహిళా స్వయం సహాయక కేంద్రం, సపోర్ట్ గ్రూప్ పేపర్ బ్యాగ్ తయారీ వర్క్‌షాప్ ఉంది. కరూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ప్రత్యేక ప్రాజెక్ట్ ప్రాసెసింగ్ విభాగం అదనపు ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌తో కలిసి డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ బుధవారం సందర్శించారు. మహిళా స్వయం సహాయ బృందాలకు పెద్ద పీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రుణాలు,ప్రోత్సహం వంటి అంశాలను పరిగణించి సాగుతున్న వివిధ ఉత్పత్తులను అధ్యయనం చేవారు. గత నాలుగు సంవత్సరాలలో 19,12,927 గ్రూపులలోని 2,48,68,051 మంది సభ్యులకు రూ.1,20,240 కోట్ల విలువైన బ్యాంకు రుణాలు అందించడం ద్వారా తమిళనాడు ఆర్థిక పురోగతిలో మహిళా బృందాలు భాగస్వామ్యయ్యాయని ఈసందర్బంగా ఉదయ నిధి పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాలలో, 41,275 మంది మహిళలు 3,175 కొత్త స్వయం సహాయక బృందాలు ఏర్పాటైనట్టు తెలిపారు.
రుణాలు పొంది..
కరూర్ కార్పొరేషన్‌లో తిరునగర్ ప్రాంతంలో 12 మంది మహిళా సభ్యులు తలిర్ మహిళా స్వయం సహాయక బృందంగా ఏర్పడి కరూర్ సిటీ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రుణాలను పొంది పేపర్ బ్యాగ్ తయారీతో పాటుగా వివిధ శిక్షణలు అందిస్తూ రావడం అభినందనీయమన్నారు. అంతే కాకుండా ఇంట్రా–గ్రూప్‌లోన్ మొత్తంతో రెస్టారెంట్ నిర్వహణ, వస్త్ర వ్యాపారం, ఫార్మసీ, టైలరింగ్ మొదలైన ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు. పేపర్ బ్యాగ్ తయారీ వర్క్‌షాప్‌లో పేపర్ బ్యాగు తయారీ యంత్రాల పనితీరును స్వయంగా తాను పరిశీలించాలని, ఇక్కడ వివిధ రకాల బ్యాగ్‌లను తయారు చేస్తున్నారన్నారు. మహిళా బృందంతో జరిగిన సమావేశంలో తలిర్ మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంకు రసీదులు, ఖర్చులు,రుణ చెల్లింపులు, సభ్యులకు తిరిగి చెల్లింపు, అంతర్గత క్రెడిట్‌తో సహా కమిటీ కార్యకలాపాలను ఆయన వివరంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జ్యోతి మణి, ఎమ్మెల్యే లుమాణిక్యం, ఆర్. ఇలంగో, కె శివకామ సుందరి, ప్రత్యేక ప్రాజెక్టు అమలు విభాగం అదనపు కార్యదర్శి డాక్టర్ ఎస్. ఉమ, జిల్లా కలెక్టర్ ఎం. తంగవేల్, మేయర్ కె. కవిత. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

మహిళా బృందాల ఉత్పత్తులపై అధ్యయనం