క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jul 10 2025 8:15 AM | Updated on Jul 10 2025 8:15 AM

క్లుప

క్లుప్తంగా

దేవుళ్లను అవమానించారంటూ..

– నటుడు సత్యరాజ్‌పై పోలీస్‌

స్టేషన్‌లో ఫిర్యాదు

తమిళసినిమా: సీనియర్‌ సినీ నటుడు సత్యరాజ్‌ నాస్తికుడు అన్న విషయం తెలిసిందే. ఈయన ద్రావిడర్‌ కళగం పార్టీ అధ్యక్షుడు పెరియార్‌. దేవుడి లేడు అనే సిద్ధాంతంతో జీవించారీయన. కాగా పెరియార్‌ వీరాభిమాని అయిన నటుడు సత్యరాజ్‌ ఇటీవల ఒక సందర్భంలో ఆస్తికానికి, నాస్తికానికి మధ్య భేదం ఏమిటన్న పెరియార్‌ను అడగ్గా ఆయన దేవాలయాల్లో హుండీలు పెడుతుంటారే అది ఆస్తికం అని పేర్కొన్నారన్నారు. ఆలయంలోని విగ్రహాలను చూపించి అది వెండినా, ఇత్తడినా అని అడిగితే అక్కడ పూజారి రాయి అని చెప్పారన్నారు. తనను ఆస్తికుల గురించి అడిగిన వారికి పెరియార్‌ ఈ విషయం గురించి చెప్పీ మీరెందుకు గొడవ పడతారు, దేవుడు అదృశ్యం అయ్యే కల్పితం అని పెరియార్‌ చెప్పారని నటుడు సత్యరాజ్‌ పేర్కొన్నారు. కాగా సత్యరాజ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హిందూ మక్కళ్‌ సమాఖ్య వ్యవస్థాపకుడు ఆర్‌డీ ప్రభు, చైన్నె కార్యవర్గ నిర్వాహకుడు సతీష్‌ బుధవారం చైన్నె పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో దేవుళ్లను అవమానించే విధంగా మాట్లాడిన నటుడు సత్యరాజ్‌ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం

తిరువళ్లూరు: తిరువళ్లూరులోని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని సీవీ నాయుడు రోడ్డులో కింగ్స్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ వుంది. ఈ సెంటర్‌ను నెల్‌లైకి చెందిన కుమార్‌(45) నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం యథావిధిగా వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్లిపోయారు. అయితే బుధవారం ఉదయం హఠాత్తుగా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నుంచి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అప్పటికే వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

సమస్యలు పరిష్కరించాలి

–జాక్టోజియో ధర్నా

తిరువళ్లూరు: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జాక్టోజియో ఆధ్వర్యంలో బుధవారం మెడికల్‌ కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆందోళనలో జాక్టోజియో రాష్ట్ర కో–ఆర్డినేటర్లు దాస్‌, జ్ఞానశేఖరన్‌ హాజరై ప్రసంగించారు. జ్ఞానశేఖరన్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయలు, ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి, పాత పింఛన్‌ విధానాన్ని అమలు చే యాలని డిమాండ్‌ చేశారు. సంఘం నిర్వాహకు లు ప్రభాకరన్‌, దివ్య, రాజాజి, జవహర్‌, షేక్‌ గఫూర్‌, సెంథిల్‌కుమార్‌, వెన్నెల పాల్గొన్నారు.

దంపతుల ఆత్మహత్య

తిరువొత్తియూరు: కుటుంబ కలహాలతో అధిక మోతాదులో బీపీ ట్యాబెట్లు మింగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. చైన్నె మనలి పుదునగర్‌కు చెందిన వేదగిరి (45), హేమమాలిని(44) దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో విరక్తి చెంది వేదగిరి బీపీ మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలిసి ఆమె కూడా బీపీ మాత్రలు మింగింది. వెంటనే కుమారుడు ఇద్దరిని ప్రభుత్వాస్పత్రిలో చేర్చాడు. అక్కడ చికిత్స పొందుతూ దంపతులు ఇద్దరు మృతిచెందారు. మనలి పుదునగర్‌ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

మద్యం మత్తులో పాఠశాలకు..

అన్నానగర్‌: మద్యం మత్తులో ఓ టీచర్‌ పాఠశాలకు వెళ్లారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. అన్నామలై పెట్టిన పోస్ట్‌లో...పాఠశాల విద్యాశాఖా మంత్రి సొంత జిల్లా తిరుచ్చి మనప్పారై సమీపంలోని వైయమలై పాలయం పంచాయతీ యూనియన్‌ ప్రాథమిక పాఠశాలలో ఒక టీచర్‌ మద్యం మత్తులో పాఠశాలకు వచ్చాడు. తరగతి గదులు లేకుండా చెట్ల కింద విద్యార్థులు చదువుకుంటున్న తిరుచ్చి జిల్లాలో, ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు మద్యం తాగి పాఠశాలకు వస్తున్నాడు. ఇవి పాఠశాల విద్యారంగం దుస్థితిని తెలియజేస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత, పాఠశాల విద్యా రంగంలో తరగతి గదుల కొరత, శాంతిభద్రతలు దారుణంగా ఉండడంతో డీఎంకే ప్రభుత్వ విభాగాలన్నీ కుంటుపడుతున్నాయి. కానీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ వీటిపై ఆందోళన చెందకుండా మరోసారి ప్రజలను మోసం చేయడానికి బయలుదేరారు. పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు బాధ్యత వహిస్తారని అన్నామలై పోస్ట్‌ చేశారు.

క్లుప్తంగా1
1/2

క్లుప్తంగా

క్లుప్తంగా2
2/2

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement