
మహాబలిపురానికి విద్యుత్ శోభ
– రూ. 13 కోట్లతో అభివృద్ధి పనులు
సాక్షి, చైన్నె : మహాబలిపురానికి మరింత వన్నె తెచ్చే విధంగా విద్యుత్ వెలుగులతో శోభాయమానంగా తీర్చిదిద్దనున్నారు. రూ. 13 కోట్లతో పనులు చేపట్టనున్నారు. సాగతీరంలో ఉన్న పురాతన పట్టణం మహాబలిపురంలోని శిల్ప సందపలు, పర్యాటక అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడకు నిత్యం సందర్శకులు తరలి వస్తూ ఉన్నారు. అయితే అభివృద్ధి, వసతులు, శుభ్రత అంత మాత్రమే. గతంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌రాకతో ఈ పర్యాటక కేంద్రం నవ్య శోభను సంతరించుకుంది. తళ తళ మెరిసే రోడ్లు, శిల్ప సందలకు కొత్త సొబగులు, సాగర తీరంలో ఆహ్లాదకరం అన్నట్టుగా పరిస్థితి మారింది. అయితే, ఇవన్నీ చైనా అధ్యక్షుడి పర్యటన ముగిసే వరకే. మళ్లీ యాథారాజ తథా ప్రజా అన్నట్టుగా పరిస్థితి మారడంతో ఇక్కడి ఎన్నో ఆందాలు,శిల్ప సందలు , నిత్యం తరలి వచ్చే సందర్శకులు, పర్యాటకులకు ఏదీ శాశ్వత సౌకర్యాలు అంటూ హైకోర్టు సైతం ఇటీవల ఓ కేసు విచారణ సమయంలో ప్రశ్నించింది.దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వాస్తవానికి సాయంత్రం ఆరు గంటల సమయంలోచీకటి పడితే చాలు శిల్ప సంపదలను చూసేందుకు వీలుండదు. ఆమేరకు ఇక్కడ అద్వన్నంగా పరిస్థితులు ఆది నుంచి ఉన్నాయి. తాజాగా నిత్యం సందర్శకులు శిల్ప సందలు, అక్కడి అందాలను వీక్షించేందుకు వీలుగా విద్యుత్ వెలుగుల మయంలో ముంచెత్తేందుకు సిద్ధమయ్యారు. బుధవారం తమిళనాటు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీరు కె. శరవణన్, మహాబలిపురం టూరిజం అధికారి టి. శక్తివేల్ ఇక్కడ చేపట్టబోతున్నట్టు ఏర్పాట్లలో భాగంగా పరిశీలన జరిపారు. రూ. 13 కోట్లతో మహాబలిపురంను విద్యుత్ వెలుగు మయంలో శోభాయమానంగా తీర్చిదిద్దనున్నారు. అలాగే, కృత్రిమ మ్యూజికల్ నీటి ధార, ఎమరాల్డ్ పార్కు వద్ద బ్రహ్మాండ ఉద్యాన వనం, మినీ 5డీ థియేటర్, లేజర్ లైటింగ్ షో, శిల్ప సందపలు కొలువై ఉన్న వివిధ ప్రాంతాలలో మరింత ఆకర్షనీయమైన విద్యుత్ వెలుగులను నింపే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు.