
ఎన్నికల కమిషన్‌కు రామన్న లేఖ
– నేనే పీఎంకే అధ్యక్షుడ్ని అని వివరణ
సాక్షి, చైన్నె: కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు బుదవారం లేఖ రాశారు. తానే పీఎంకేకు వ్యవస్థాపక అధ్యక్షుడ్ని అని అందులో వివరించారు. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న అధికార సమయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా రాందాసు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిస్తూ లేఖ రాశారు. పీఎంకేలో అన్బుమణి ప్రస్తానం గురించి వివరిస్తూ, పీఎంకే నియమ నిబంధనలను ఆ లేఖలో వివరించారు. అన్బుమణి అధ్యక్ష పదవి కాలం ముగిసిందని వివరిస్తూ, ఎగ్జిక్యూటివ్ కమిటీ గురించి ప్రస్తావించారు. మే నెల నుంచి తానే పీఎంకేకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నట్టు వివరించారు. పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగాఎ గ్జిక్యూటీవ్ కమిటీలోని 21 మంది గురించి వివరిస్తూ, వీరితో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు. పార్టీకి సంబంధించి అంశాలు, వ్యవహారాలు, ఎన్నికల సందర్భంగా బీ ఫామ్‌లలోసంతకాలు చేసే అధికారం తనకే ఉందనివివరించారు. అన్బుమణి అధ్యక్ష పదవి మే నెల 28వ తేదిన ముగిసిందంటూ ప్రత్యేకంగా ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. అలాగే, ఆయన పేలవమైన పనితీరు కారణంగా ఎగ్జిక్యూటీవ్ పదవి నుంచి తప్పించినట్టు వివరించారు. 21 మంది ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యుల మద్దతు తనకే ఉందని, ఈ దృష్ట్యా, పార్టీకి తానే అధ్యక్షుడ్ని అని స్పష్టం చేస్తూ లేఖలో మరిన్ని వివరాలను పొందు పరిచారు.