
ఈసీఆర్‌లో కొత్త ఐకానిక్‌గా రాజ్ పారిస్
– బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రుతిహాసన్
సాక్షి, చైన్నె: ఈస్ట్ కోస్టు రోడ్డులో కొత్త ఐకానిక్‌గా బ్రహ్మాండ లగ్జరీ ప్రాజెక్టుగా రాజ్ పారిస్ బ్లూ జ్యువెల్‌ను ఆవిష్కరించనున్నారు. ఇందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి శృతి హాసన్ వ్యవహరిస్తున్నారు. చైన్నెలో బుధవారం జరిగిన సమావేశంలో నిర్మాణ సంస్థ రాజ్ పారిస్ 2030 నాటికి రూ. 500 కోట్ల ఆదాయ సంస్థగా మార్చే విధంగా కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది. ఆ సంస్థ వ్యవస్థాపకులు ఆర్ సచ్చిదానందం, ఎండీ ఆర్ జయకుమార్, రాజ్‌కుమార్ సచ్చిదానందం మాట్లాడుతూ ఈసీఆర్‌లోని ముట్టు కాడులో ప్రశాంత పూరిత పరిసరాలలో సముద్ర తీరంలో ఒక బోటిక్ లగ్జరీ ప్రాజెక్టుగా బ్లూ జ్యువెల్‌ను 55 కుటుంబాల కోసం బహుళ అంతస్తుల భవనాన్ని ఒక కొత్త ఐకానిక్‌గా నిలిచే విధంగా తీర్చిదిద్దనున్నామని వివరించారు. కాంచీపురం, మదురైలతో పాటు చైన్నెలోని వెంచర్లను సకాలంలో పూర్తి చేసి ఉన్నామన్నారు. రాజ్ పారిస్ బ్లూ జ్యువెల్ ప్రాజెక్టుకు సినీ నటి శ్రుతిహాసన్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేశామన్నారు. ఈ సందర్భంగా వీడియో ద్వారా శ్రుతిహాసన్ ఆ ప్రాజెక్టులోని లగ్జరీ సేవలను వివరించారు.