రేపు చైన్నెలో రాజన్న జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

రేపు చైన్నెలో రాజన్న జయంతి వేడుకలు

Jul 7 2025 6:46 AM | Updated on Jul 7 2025 6:46 AM

రేపు చైన్నెలో రాజన్న జయంతి వేడుకలు

రేపు చైన్నెలో రాజన్న జయంతి వేడుకలు

● అభిమానులకు పిలుపు ● రక్తదానం, అన్నదానం వంటి సేవలకు ఏర్పాట్లు

సాక్షి, చైన్నె: సంక్షేమమే శ్వాసగా, పేదల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగి జన హృదయాల్లో చెరని ముద్ర వేసుకున్న మహానాయకుడు వైఎస్సార్‌ జయంతి వేడుకలను చైన్నెలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్‌ సేవాదళ్‌, ఐటీ విభాగాలు సిద్ధమయ్యాయి. మంగళవారం చైన్నెలో అన్నదానం, రక్తదానం వంటి పలు సేవలకు నిర్ణయించారు. ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో అభిమానులు, మద్దతు దారులు, సేవాదల్‌,వైఎస్సార్‌ సీపీ వర్గాలు తరలి వచ్చి భాగస్వామ్యం కావాలని తమిళనాడు వైఎస్సార్‌ సేవాదళ్‌ అధ్యక్షుడు ఏకే జహీర్‌ హుస్సేన్‌ పిలుపు నిచ్చారు. వివరాలు.. రైతు బాంధవుడిగా, జల యజ్ఞ ప్రదాతగా, పేదల పెన్నిదిగా ప్రతి తెలుగు వాడి గుండెల్లో గూడు కట్టుకున్న మహా నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డికి చైన్నెతో విడదీయని బంధం ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన వారసుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వెన్నంటి ఇక్కడి అభిమాన లోకం కదులుతోంది. వైఎస్సార్‌ సేవాదళ్‌ తమిళనాడు విభాగం వేదికగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో మంగళవారం మహానేత రాజన్న జయంతి సందర్భంగా ఏర్పాట్ల మీద దృష్టి పెట్టారు.

అభిమానులకు పిలుపు

మహానేత 76వ జయంతి సందర్భంగా ఆయన్ను స్మరిస్తూ సేవా కార్యక్రమాలకు తమిళనాడు వైఎస్సార్‌ సేవాదళ్‌, ఐటీ విభాగం సిద్ధమయ్యాయి. పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ విషయంగా జహీర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ, వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఐటీ విభాగంతో కలిసి ఓఎంఆర్‌లో రక్తదాన శిబిరంకు ఏర్పాట్లు చేశామన్నారు. ఫాతీమా అనాథ ఆశ్రమం, పాఠశాలలకు ఉదయం అల్పాహారం పంపిణీతో పాటూ అక్కడి పిల్లలకు పుస్తకాలను , విద్యా ఉపకరణాలను అందించనున్నామన్నారు. కేక్‌ కట్టింగ్‌లతో పాటూ రాజన్నను స్మరిస్తూ ప్రత్యేక ప్రార్ధనలు, వివిధ సేవా కార్యక్రమాలకు చర్యలు తీసుకున్నామన్నారు. మధ్యాహ్నం అందరికి బీర్యాని పంచి పెట్టనున్నామని వివరించారు. ఈ జయంతి వేడుకకు పెద్దసంఖ్యలో వైఎస్సార్‌ సీపీ, సేవాదళ్‌ వర్గాలు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు, మద్దతు యువ సమూహం, ఐటీ విభాగంలోకి వర్గాలు పెద్ద సంఖ్యలతో తరలి రావాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ నేత, మాజీ మంత్రి ఆర్‌కే రోజా, ఐటీ విభాగం నేత సునీల్‌ తదితరులు హాజరు అవుతున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement