సాక్షి, చైన్నె: ఎలక్ట్రిక్ వాహన ఆవిష్కరణలకు వేదికగా సెంటర్ ఫర్ ఎలక్ట్రికల్ మొబిలిటీ(సీఈఎం)ను స్టెల్లాంటిస్ నేతృత్వంలో చైన్నె శివారులో ఏర్పాటు చేశారు. విద్యార్థులకు విద్యా నైపుణ్యం లక్ష్యంగా కాటాన్ కొళత్తూరులోని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవరణలో ఎలక్ట్రిక్ వాహన పరిశోధనల ఆవిష్కరణ కోసం ఈ సెంటర్‌ను నెలకొల్పారు. ఈ సెంటర్ హెడ్ భారతీ రాజా చొక్కలింగం మాట్లాడుతూ, స్టెల్లాంటిస్ ఇండియా సహకారంతో రెండుసిట్రోయెన్ ఎలక్ట్రిక్ వాహనాలను ఈ కేంద్రానికి అందించారని వివరించారు. స్టెల్లాంటిస్ ఇండియా అధికారి అశ్విన్ కౌండిన్య ఈవీ సాంకేతికతల పురోగతిని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వాహన ఇంజనీర్లను తీర్చిదిద్దేదిశగా ఈసెంటర్‌కు సహకారం అందించారన్నారు. స్టెల్లాంటిస్ ఇండియా ప్రతినిధి శ్రీరామ్ వెంకటరమణన్ మాట్లాడుతూ, లోతైన పరిశోధన సామర్థ్యాలను వాస్తవ ప్రపంచంలో మిళితం చేసి విద్యా సంస్థల తోడ్పాటుతో బలమైన ఆవిష్కరణల మీద దృష్టి పెట్టామన్నారు.