ఇక మళ్లీ భానుడి సెగ | Sakshi
Sakshi News home page

ఇక మళ్లీ భానుడి సెగ

Published Mon, May 27 2024 6:20 PM

ఇక మళ్లీ భానుడి సెగ

సాక్షి, చైన్నె: రెమల్‌ తుపాన్‌ గాలిలోని తేమనంతా తీసుకెళ్లిపోవడంతో రాష్ట్రంలోని అనేక జిల్లాలలో మళ్లీ ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగనున్నాయి. సాధారణం కంటే మూడు డిగ్రీలు అఽధికంగా కొద్ది రోజుల పాటు భానుడి సెగను మళ్లీ ప్రజలు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది అగ్నినక్షత్రం వేళ భానుడి ప్రతాపం రాష్ట్రంలో కనిపించ లేదు. మార్చి, ఏప్రిల్‌ నెలలో భానుడు భగ..భభగ మండినా, ఆ తదుపరి అకాల వర్షం కారణంగా రాష్ట్రంలో అనేక జిల్లాలో వాతావరణం చల్ల బడింది. ప్రధానంగా పశ్చిమ పర్వత్ర శ్రేణుల వెండి ఉన్న జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జూన్‌ 1వ తేదీ కేరళ తీరాన్ని నైరుతి పవనాలు తాకనున్న నేపథ్యంలో ఈ జిల్లాలలో మరింతగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. శనివారం రాత్రంతా కన్యాకుమారిలో వర్షం పడింది. ఇక్కడి తిరుప్పరపు జలపాతంలో వరదలు పోటెత్తాయి. మణిముత్తారు, గోదై నదులలో నీటి ఉధృతి పెరిగింది. వర్షాల పుణ్యమా కుమరి సముద్ర తీరం పర్యాటకంగా వెలవెల బోయినట్టుగా ఆదివారం పరిస్థితులు నెలకొన్నాయి. తెన్‌కాశి జిల్లా కుట్రాలం జలపాతంలో నీటి ఉధృతి తగ్గడంతో సందర్శకులకు అనుమతి ఇచ్చారు. దీంతో జలపాతంలో స్నానం చేయడానికి జనం ఎగబడ్డారు. ఇక సముద్ర తీరంలో అలల తాకిడి క్రమంగా తగ్గింది. రామనాథపురం జిల్లాలో పలుచోట్ల, నాగపట్నం జిల్లా వేదారణ్యం పరిసరాలలో కొన్ని చోట్ల సముద్రం వంద నుంచి రెండువందల అడుగుల వరకు వెనక్కి వెళ్లడం గమనార్హం. రెమల్‌ తుపాన్‌ గాలిలోని తేమను అంతా లాక్కెళ్లడంతో మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా ఉంటాయని పేర్కొనడంతో మళ్లీ భానుడి సెగను ప్రజలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అగ్ని నక్షత్రం సీజన్‌ 28వ తేదీతో ముగియనున్నడంతో జూన్‌ 1వ తేదీ నైరుతి రుతు పవనాల ప్రవేశంతో వాతావరణం క్రమంగా మళ్లీ చల్లబడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement